
మెగా ఫ్యామిలీలో ఎవరికీ ఇష్టం లేకపోయినా కానీ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల తన నటతృష్ణ తీర్చుకోవడానికి హీరోయిన్ అయింది. అయితే మొదటి సినిమాకే రాంగ్ స్టెప్ వేసింది. ‘ఒక మనసు’లాంటి కథని ఎంచుకోవడంతో ఆమెకి ఆదిలోనే డిజాస్టర్ ఎదురైంది. దాంతో మళ్లీ స్టెప్ తీసుకునే ధైర్యం చేయలేకపోతోంది.
అసలే మెగా ఫ్యామిలీకి చెందిన అమ్మాయి కావడంతో సగటు హీరోయిన్ పాత్రలతో ఆమెని అప్రోచ్ అవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. మొదటి సినిమా ఫ్లాప్‌తో మళ్లీ సినిమా అంటే భయపడుతోన్న నిహారికని ఆ దిశగా మెగా ఫ్యామిలీ కూడా ప్రోత్సహించడం లేదు.
తనంతట తానుగా నటిస్తానంటూ చెబితే ఎవరూ అడ్డు చెప్పలేరు కానీ, పనిగట్టుకుని ఇప్పుడు తనని హీరోయిన్‌గా నిలబెట్టాలని ఎవరనుకుంటారు? సినిమా ఫ్లాప్ అయిన తర్వాత చాలా కాలం మీడియా ముందుకి కూడా రానంతగా హర్ట్ అయిన నిహారిక బహుశా మళ్లీ ఆ ప్రయత్నం చేయాలంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వాలేమో. అందుకే యాక్టింగ్ పట్ల తనకున్న మక్కువని తీర్చుకోవడానికి నిహారిక వెబ్ సిరీస్‌లతో కాలక్షేపం చేస్తోంది.
యూట్యూబ్‌లో ఫ్రీగా చూడ్డానికి అయితే ఆమె చేస్తోన్న ప్రయత్నాలని తీరిక వేళల్లో చూడ్డానికి ఎవరికీ ఏ ఇబ్బందీ ఉండదు. ఆ పొగడ్తలు చాలనుకుని వెండితెరపై ఆశలు వదిలేసుకున్నట్టే కనిపిస్తోంది. తెలుగు సినిమాల వరకు స్టార్ ఫ్యామిలీస్‌కి చెందిన అమ్మాయిలకి యాక్టింగ్ కెరియర్ కరక్ట్ కాదని ఇంకోసారి రుజువైంది.
Recent Random Post: