తెలుగు సినీ పరిశ్రమలో విభిన్న కథలతో ఆకట్టుకుంటున్న నిఖిల్ తాజాగా దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే నిఖిల్ హీరో కాకముందే హైదరాబాద్ నవాబ్స్ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా(సహ దర్శకుడు) పనిచేశారు. ఇటీవల ఓ టీవీ షోలో నిఖిల్ మాట్లడుతూ త్వరలోనే చిన్నారులతో ఓ సినిమా తీస్తానని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లు తెలిపాడు. ప్రస్తుత లాక్‌డౌన్ సమయంలో అన్ని నియమాలు పాటిస్తు సినిమాను రూపొందిస్తానని పేర్కొన్నారు.
అయితే నటుడిగా అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకున్న నిఖిల్ దర్శకత్వ విభాగాలలో కూడా సత్తా చాటాలని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. ఇటీవల ’అర్జున్ సురవరం’ విజయంతో నిఖిల్ మంచి స్పీడు మీదున్నారు. వరుసగా సినిమాలు ఒప్పుకుంటున్నారు. చందు మొండేటి దర్శకత్వంలో ‘కార్తికేయ–2’ చిత్రాన్ని, సూర్యప్రతాప్ దర్శకత్వంలో ‘18 పేజెస్’ చిత్రాలను ఇప్పటికే చేస్తున్న సంగతి తెలిసిందే.
Recent Random Post: