స్పైడర్ వాయిదా పక్కా అంటే పక్కా

మహేష్ బాబు కొత్త సినిమా ‘స్సైడర్’ వాయిదా అంటూ జరుగుతున్న ప్రచారం నిజమే అని ఫిక్సయిపోవచ్చు. జూన్ 23న ఆ సినిమా రానట్లే అని తేలిపోయింది. ఎందుకంటే అదే రోజుకు ఓ మీడియం రేంజి సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. అదే.. నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ‘నిన్ను కోరి’.

ఈ చిత్రాన్ని జూన్ 23 ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాత డీవీవీ దానయ్య అఫీషియల్ ప్రెస్ నోట్ కూడా ఇచ్చేశాడు. ‘స్పైడర్’ తర్వాత మహేష్.. కొరటాల శివతో చేయాల్సిన సినిమాను నిర్మించబోయేది దానయ్యే. కాబట్టి మహేష్ నుంచి పక్కా సమాచారం అందుకున్నాకే ‘నిన్ను కోరి’ రిలీజ్ డేట్ ను దానయ్య ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

మరోవైపు మే 19 నుంచి జూన్ 23కు వాయిదా పడ్డట్లుగా చెప్పుకున్న ‘దువ్వాడ జగన్నాథం’ విషయంలో క్లారిటీ లేనట్లే తెలుస్తోంది. ఆ సినిమా జూన్ 23కు పక్కా అయితే.. నాని సినిమాకు ఆ తేదీకి షెడ్యూల్ చేసేవాళ్లు కాదు. బన్నీ సినిమా సరిగ్గా ఎప్పుడు పూర్తవుతుంది.. ఏ రోజు విడుదలవుతుంది అన్నది క్లారిటీ లేకపోవడంతో నాని సినిమాకు బెర్తు బుక్ చేసేశారు.

ఈ చిత్రం ఇటీవలే అమెరికాలో లాంగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చింది. ప్రస్తుతం వైజాగ్‌లో షెడ్యూల్ చేస్తున్నారు. ఇంకొన్ని రోజుల్లోనే టాకీ పార్ట్ మొత్తం పూర్తయిపోతుందని సమాచారం. మేలో నెలాఖర్లో ఆడియో విడుదల చేసి.. జూన్ 23న  సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. కొత్త దర్శకుడు శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.


Recent Random Post: