నా ఇమేజ్‌ చూసుకోండి భయ్యా: ఎన్టీఆర్‌

టీవీ రంగంలోకి అడుగు పెట్టడానికి ఎన్టీఆర్‌కి టెంప్టింగ్‌ ఆఫర్‌ వచ్చేసరికి, దానికోసం ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం రాకపోయే సరికి బిగ్‌బాస్‌ సైన్‌ చేసేసాడు. అయితే కాంట్రవర్సీలు లేనిదే ఇలాంటి షోలు సక్సెస్‌ అయిన దాఖలాలు లేవు. తెలుగు వెర్షన్‌ వరకు విపరీతమైన కాంట్రవర్సీలు ఏమీ వుండకుండా చూసుకుంటామనే హామీతోనే ఎన్టీఆర్‌ ఇది చేపట్టాడు.

అయితే భారీగా ఖర్చు పెడుతోన్న షో క్లిక్‌ అవ్వాలంటే తగినంత మసాలా ఆ షోలో వుండేట్టు చూసుకోవాలని ఏ ఛానల్‌ అయినా కోరుకుంటుంది. ఎన్టీఆర్‌ అఫెండ్‌ అవకుండా బిగ్‌ బాస్‌ షోని జనరంజకంగా మార్చడానికి గల మార్గాలని అన్వేషిస్తున్నారట. ప్రస్తుతం వస్తున్న పబ్లిక్‌ ఫీడ్‌బ్యాక్‌ అయితే అంత అనుకూలంగా లేదు. ఈ షో ఇలాగే చప్పగా కొనసాగినట్టయితే మున్ముందు టీఆర్పీలు రావడం కష్టమవుతుంది. అందుకని దీనిని స్పైస్‌ అప్‌ చేయడానికి రచయితలు ప్రయత్నిస్తున్నారు.

కానీ ఈ షో గీత దాటకుండా, తన ఇమేజ్‌కి భంగం వాటిల్లకుండా నడుచుకునేలా చూసుకునేట్టు కొందరిని ఎన్టీఆర్‌ పర్సనల్‌గా నియమించాడని, వారి అప్రూవల్‌ లేనిదే కొన్ని ఇక్కడ జరగడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలుగు టీవీ రంగం వరకు ఇంతవరకు కాంట్రవర్సీలు లేకుండా క్లీన్‌గా వుంది. తన షో అలాంటి ట్రెండుకి నాందికి పలకుండా ఎన్టీఆర్‌ కేర్‌ తీసుకుంటున్నాడు. మరి ఎలాంటి వివాదాలు లేకుండా ఇలాంటి షోని హిట్‌ చేసుకుంటారనేది వేచి చూడాల్సిందే.


Recent Random Post: