
నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం చేసారని, ప్రత్యేక హోదా ఇస్తామని మాట ఇచ్చి తప్పారని, కేంద్ర ప్రభుత్వంపై పవన్‌కళ్యాణ్ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తోన్న సంగతి తెలిసిందే. నరేంద్ర మోడీ విధానాలని అమితంగా అభిమానించే రచయిత, నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి ఈ విషయంలో పవన్‌ని తప్పుబడుతున్నాడు.
ప్రజల సమస్యలపై మాట్లాడే హక్కు పవన్‌కళ్యాణ్‌కి లేదంటున్నాడు. పవన్ నిజాయితీ పరుడేనని, స్వార్ధం లేదని అంటూనే, ప్రజా సేవే చేయాలని వుంటే సినిమాలు వదిలేసి వచ్చి ప్రజల్లో తిరగాలని పోసాని సూచించాడు. పవన్‌కళ్యాణ్ ఎక్కడో ఏసీ గదుల్లో కూర్చుని, ట్విట్టర్‌లో గళం వినిపిస్తే కుదరదని, అన్నీ వదిలేసుకుని రోడ్డు మీదకి రావాలని పోసాని అన్నాడు.
అప్పుడు ఎన్టీఆర్ చేసినట్టు పవన్‌కళ్యాణ్ పాదయాత్ర చేయాలని, రోడ్డు పక్కన పడుకోవాలని, ప్రజలతో మమేకమైపోయి, ప్రత్యేక హోదా వల్ల వచ్చే లాభాలని జనానికి వివరించాలని, అంతే తప్ప బయటకి రాకుండా ఎక్కడో వుండి విమర్శలు చేస్తే కుదరదన్నాడు.
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇస్తే ఇంకో తొమ్మిది రాష్ట్రాలకి కూడా ఇవ్వాల్సి వస్తుందని, అంచేతే మోడీ వెనకాడారు తప్ప ఆయన ప్రజలని మోసం చేసే మనిషి కాదని చెప్పాడు. అదే విధంగా చంద్రబాబు డైరెక్షన్‌లోనే పవన్ రాజకీయ కదలికలు సాగుతున్నాయని పరోక్షంగా పోసాని అభిప్రాయపడ్డాడు.
Recent Random Post: