ఆయన్ను నమ్ముకుంటే పవన్ పనీ అంతేనా…?

నెల రోజుల కిందట అమెరికా వెళ్లినప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్టీవెన్ జార్డింగ్ అనే ఒక హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ తో గంటన్నరపాటు భేటీ అయ్యారు. అప్పట్లో అది సంచలనమైంది.  స్టీవెన్ జార్డింగ్ అంటే రాజకీయ సలహాదారుగా.. ఎన్నికల వ్యూహకర్తగా ఇంటర్నేషనల్ గా టాప్ బ్రాండ్. ఆయన అడుగు పెడితే ప్రత్యర్థులకు ఓటమే అంటారు. 2019 ఎన్నికల్లో పవన్ కోసం పనిచేసేలా ఆయనతో ఒప్పందం కుదుర్చుకునేందుకే భేటీ అయ్యారని భావించారు. కానీ.. తాజా పరిణామాలు చూస్తుంటే అదే జరిగితే పవన్ కథ కంచికేనంటున్నారు.

ఇటీవల కాలంలో జార్డింగ్ ఎవరికోసం పనిచేసినా వారు ఓడిపోతున్నారు. అమెరికాలో హిల్లరీ క్లింటన్ కోసం జార్డింగ్ ఎన్ని ప్లాన్లు, స్కెచ్ లు గీసినా అవేమీ వర్కవుట్ కాలేదు. అక్కడ ట్రంప్ జెండా ఎగరేశాడు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో అఖిలేశ్ యాదవ్ కూడా జార్డింగ్ సలహాలే తీసుకున్నారు. జార్డింగ్ ఇక్కడకొచ్చి చాలా వర్క్ చేశారు. ఇక్కడ తన టీంను ఉంచి పనిచేయించారు. జార్డింగ్ సలహాలను అఖిలేశ్ పాటించారు. అయినా… మోడీ ముందు అవన్నీ తేలిపోయాయి. ఇవన్నీ చూస్తున్నవారు చెప్పేదొకటే.. అన్నిసార్లు ఇలాంటివి వర్కవుట్ కావని.. ప్రధాన ఫ్యాక్టర్స్ కు ఇలాంటి సలహాలు కొంతమేరకు మాత్రమే పనిచేస్తాయని చెబుతున్నారు.

అంతేకాదు.. విదేశాల్లో వర్కవుట్ అయ్యే రాజకీయ టెక్నిక్స్ ఇండియాలో పనిచేయవని.. ఇక్కడ కులాలు, మతాలతో పాటు అనేక ఇతర అంశాలుంటాయి. ప్రజల పొలిటికల్ మెచ్చూరిటీ లెవల్స్.. సోషల్ రెస్పాన్సిబిలిటీ లెవల్స్ లోనూ తేడాలుంటాయి. ఆ కారణంగానే విదేశాల్లో కూడా అమెరికాలో జార్డింగ్ పాచికలు పారలేదు. సో… పవన్ వెల్లి జార్డింగ్ ను ఏపీకి తెచ్చినా పెద్దగా లాభముండదని అంటున్నారు. మరి తాజా పరిణామాల నేపథ్యంలో పవన్ జార్డింగ్ కోసం భారీగా ఖర్చు చేస్తారో.. లేదంటే తన టాలెంట్ ను నమ్ముకుని డైరెక్టుగా రంగంలోకి దిగుతారో చూడాలి.


Recent Random Post: