డ్రైవింగ్ లైసెన్స్ రిమేక్ లో నటించనున్న పవన్ కళ్యాణ్!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తర్వాత వచ్చే సర్వత్రిక ఎన్నికల లోపు వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలనీ చూస్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే వకీల్ సాబ్ ను విడుదల చేసాడు పవన్ కళ్యాణ్. అలాగే ప్రస్తుతం రెండు సినిమాల చిత్రీకరణలతో బిజీగా ఉన్నాడు.

పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటిస్తోన్న భీమ్లా నాయక్ ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. అలాగే క్రిష్ దర్శకత్వంలో హరిహర వీర మల్లు సినిమాలో కూడా నటిస్తున్నాడు.

దీంతో పాటు మరో రెండు చిత్రాలు లైన్లో ఉన్నాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ షూటింగ్ ను మొదలుపెట్టాలి. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో సినిమా కూడా ఉంది.

తాజా సమాచారం ప్రకారం మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన డ్రైవింగ్ లైసెన్స్ రిమేక్ లో పవన్ కళ్యాణ్ నటిస్తాడని ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.