పవన్‌ వీరమల్లు షూటింగ్ లో జాయిన్‌ అయ్యేది ఎప్పుడంటే..!

పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ విడుదలకు సిద్దం అయ్యింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యి విడుదల కు సిద్దంగా ఉన్నా కూడా కరోనా వల్ల సంక్రాంతికి విడుదల అవ్వడం లేదు. పెద్ద సినిమాలకు సైడ్‌ ఇవ్వడం కోసం అన్నట్లుగా భీమ్లా నాయక్‌ ను వాయిదా వేస్తే ఇప్పుడు ఆ సినిమాలు కూడా వాయిదా పడ్డాయి. కాని భీమ్లా నాయక్ సినిమా కూడా వాయిదా పడే పరిస్థితి వచ్చింది. ఇక పవన్‌ కళ్యాణ్ తదుపరి సినిమా హరి హర వీరమల్లు. ఈ సినిమా చిత్రీకరణ మొదలు అయినప్పటి నుండి కూడా ఏదో ఒక ఇబ్బంది.

కరోనా వల్ల సినిమా షూటింగ్‌ గత ఏడాది నుండి అదుగో ఇదుగో అన్నట్లుగానే వాయిదాలు వేస్తు వచ్చారు. ఇప్పటి వరకు సినిమా షూటింగ్ సగం పూర్తి అయ్యింది. థర్డ్‌ వేవ్‌ వచ్చి ఉండకుంటే చకచక పూర్తి చేసి సమ్మర్‌ లో హరి హర వీరమల్లు సినిమాను విడుదల చేసేవారు. కాని ఇప్పుడు షూటింగ్‌ ను మొదలు పెట్టడానికి థర్డ్‌ వేవ్‌ పూర్తిగా తగ్గాలని పవన్ సూచించాడట. దాంతో మార్చి ఏప్రిల్‌ వరకు షూటింగ్‌ పునః ప్రారంభం అవ్వడం కూడా కష్టం అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. సమ్మర్ లో షూటింగ్‌ పునః ప్రారంభం అయితే అప్పుడు విడుదల విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాదిలో సినిమా విడుదల కావాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.