మొన్నటి వరకు బీజేపీ ప్రభుత్వంపై ప్రధానిపై విమర్శలు గుప్పించిన జనసైనికులు ఇప్పుడు బీజేపీకి దగ్గర అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయాల్లో ఎవరు శాస్వత మిత్రులు కారు, ఎవరు శాస్వత శత్రువులు కారు అనే నానుడిని పవన్ టీం బాగా వంట బట్టించుకున్నారేమో ఇప్పుడు బీజేపీకి మద్దతుగా మాట్లాడుతూ ఉన్నారు.
కరోనా విపత్తు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పథకాలు మరియు తీసుకుంటున్న చర్యలపై పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపిస్తూ ప్రెస్ నోట్‌ను విడుదల చేయడం జరిగింది.
మద్య తరగతి వారికి, వేతన జీవులకు, చిరు వ్యాపారస్తులకు కేంద్రం తీసుకున్న నిర్ణయం కాస్త ఊరట కలిగించే విధంగా ఉందని పవన్ అభిప్రాయ పడ్డారు. ఆత్మనిర్భర్ ప్యాకేజీలో పేదలు మరియు వేతన జీవుల గురించి చేసిన కేటాయింపులు వారికి చాలా మేలు చేస్తాయని అన్నారు.
లక్షన్నర వరకు వడ్డీ రాయితీ రుణాలు ఇవ్వడంతో పాటు రుణాలు తీసుకున్న వారికి కాస్త ఉపశమనం కల్పించేలా చర్యలు తీసుకున్నారు. ఆదాయపు పన్ను రీఫండ్ చెల్లింపు జాప్యంను తగ్గించడం ద్వారా 14 లక్షల మందికి ఊరట లభించిందని ఈ సందర్బంగా పవన్ ప్రెస్ నోట్లో అభిప్రాయ పడ్డారు.
మధ్యతరగతికి ఆర్థిక భరోసా కల్పిస్తున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు – JanaSena Chief @PawanKalyan pic.twitter.com/J8Sxrwa7g8
— JanaSena Party (@JanaSenaParty) June 7, 2020
Recent Random Post: