ప్యాకేజీ తీసుకునోటుడో కాదు.! ఆ ప్యాకేజీ ఇచ్చేటోడు పవన్ కళ్యాణ్.!

పవన్ కళ్యాణ్‌ని ప్యాకేజీ స్టార్.. అంటూ వైసీపీ నేతలు పదే పదే విమర్శిస్తుంటారు. నిన్ననే మాజీ మంత్రి కొడాలి నాని, చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకునేటోడు పవన్ కళ్యాణ్.. అంటూ విమర్శించారు. ఇలా విమర్శించి, బూతుల మాట్లాడినందువల్లే కొడాలి నాని మంత్రి పదవి పోగొట్టుకున్నారు. చిత్రమేంటంటే, తాను బూతులు మాట్లాడుతున్నాననీ ఆయనకు తెలియదు.. తన బూతుల వల్లే తన మంత్రి పదవి పోయిందనీ ఆయనకు అర్థం కాదు.

అదేదో ట్రాన్స్‌లో వుండి పవన్ కళ్యాణ్‌ని విమర్శించడం తప్పితే, మంత్రి పదవిలో వున్నన్నాళ్ళూ పోనీ, ఆ ప్యాకేజీ పవన్ కళ్యాణ్‌కి చంద్రబాబు నుంచి ఎలా వెళ్ళిందో ఆరా తీసి, బయటపెట్టే సాహసం కూడా చేయలేకపోయారు కొడాలి నాని. ప్రజల గురించి ఎలాగూ బాధ్యత లేదు, కనీసం వైసీపీ కోసమైనా బాధ్యతగా పవన్ కళ్యాణ్ ప్యాకేజీ గుట్టుని వైసీపీ నేత కొడాలి నాని బయట పెట్టి వుంటే బావుండేది. అది చేత కాదు గనుకనే, మంత్రి పదవి నుంచి కొడాలి నానిని పీకి పారేశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

అయినాసరే, కొడాలి నాని ‘నేను మారేది లే..’ అంటున్నారు. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకునేటోడు కాదు.! ప్రజల కోసం ప్యాకేజీ ఇచ్చేటోడు. కళ్ళుండీ కబోదుల్లా వ్యవహరించాలనే లక్ష్యం వైసీపీ నేతలు పెట్టుకోబట్టే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌలు రైతులకు చేస్తున్న సాయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు.

పవన్ కళ్యాణ్ సినిమాల్ని వైసీపీ సర్కారు తొక్కేస్తున్నాగానీ, ఆ సినిమాల్లో నటించడం వల్ల వచ్చే రెమ్యునరేషన్ నుంచి, ప్రజలను ఆదుకోవడానికి తనవంతు సాయం చేస్తున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఇందుకు కదా, పవన్ కళ్యాణ్ సినిమాలు విజయవంతమవ్వాలని ఆయన అభిమానులు కోరుకునేది.?

మంత్రి పదవి వస్తే రాజకీయ నాయకులు దోచుకుంటారు.. కానీ, పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించి, తద్వారా సామాన్యులకు తనవంతు సాయం చేయగలుగుతున్నారు. అదీ తేడా.! ప్రెస్ మీట్లు పెడితే, రోజువారీ జీతాలొచ్చే వ్యవహారాలు నడిపేటోళ్ళు కూడా పవన్ కళ్యాణ్‌ని విమర్శిస్తే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.?