రాజకీయాల్లోకి ఫుల్ టైం వెళ్ళిపోయాక ఇక మళ్ళీ సినిమాల వైపు చూడనని చెప్పిన పవన్ కళ్యాణ్ మనసు మార్చుకోవడానికి కారణం ఆర్థిక లెక్కలే. పవర్లో లేకుండా పార్టీని నడిపించాలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కనుక, సినిమాకు యాభై కోట్ల పారితోషికం ఇస్తామని అంటున్న నిర్మాతలు పవన్ ని ఇటు టెంప్ట్ చేసారు.
మళ్ళీ ఎన్నికల హంగామా మొదలవడానికి సమయం ఉంది కనుక ఈలోగా ఒక అరడజను సినిమాలు చేసి 300 కోట్లు సంపాదిస్తే తదుపరి ఎన్నికల వేళ ప్రచారానికి, సెక్యూరిటీ, మెయింటెనెన్సు తదితర ఖర్చులకు పనికొస్తుందని పవన్ భావించాడు. ఈ ఏడాదిలో రెండు సినిమాలు విడుదల చేయాలనేది పవన్ ప్లాన్. కానీ ఆ రెండు సినిమాలు పూర్తయి బయటకు రావడానికి వచ్చే ఏడాది కూడా గడచిపోయేట్టు ఉంది.
హరీష్ శంకర్ తో మైత్రి మూవీస్ సినిమా చేసిన తర్వాత ఇక పవన్ కి వేరే సినిమాలు చేసే తీరిక ఉండకపోవచ్చు. లాస్ట్ టైం ఎన్నికలకు లేట్ గా ఎంట్రీ ఇచ్చిన పవన్ ఈసారి ఆ తప్పు చేయకపోవచ్చు కనుక సినిమాల్లో ఏమి చేసినా వచ్చే రెండేళ్లలోనే చేయాలి.
Recent Random Post: