పవన్ కళ్యాణ్ ప్లాన్స్ అన్నీ తారుమారు.!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు వద్దనుకుని రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు. అయితే అనూహ్యంగా ఎన్నికలలో ఓటమి ఎదురవ్వడం, వచ్చే ఎలక్షన్స్ కు ఇంకా చాలా సమయం ఉండడం, అప్పటిదాకా తన పార్టీను నడపడానికి డబ్బులు కావాలి కాబట్టి సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు పవన్. ఇందుకు తగ్గట్లుగానే పవన్ కళ్యాణ్ కోసం నిర్మాతలు భారీ రెమ్యునరేషన్ ను ఆఫర్ చేస్తూ ముందుకు వచ్చారు. ప్రతీ సినిమాకూ 40 నుండి 50 కోట్ల దాకా రెమ్యునరేషన్ ఆఫర్లు రావడంతో తక్కువ సమయంలోనే మూడు సినిమాలకు కమిట్ అయ్యాడు పవన్.

2024 ఎలక్షన్స్ లోపు ఏడాదికి రెండు లేదా మూడు చొప్పున వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలని పవన్ భావించాడు. ఇందుకు తగ్గట్లుగానే ఒక సినిమా షూటింగ్ ను వేగంగా పూర్తి చేస్తున్నాడు. మరికొంత మంది నిర్మాతలు పవన్ కోసం ఎదురుచూస్తున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే కరోనా కారణంగా షూటింగులకు బ్రేక్ పడింది.

అన్నీ బాగుండి ఉంటే ఈపాటికి పవన్ సినిమా ఒకటి విడుదలయ్యేది, మరొకటి సగం షూటింగ్ పూర్తి చేసుకుని ఉండేది. ఇప్పుడు ఈ ఏడాది చివరికి కానీ షూటింగ్స్ మొదలుపెట్టేలా పరిస్థితి లేదు. పవన్ చేతిలో ప్రస్తుతమున్న కమిట్మెంట్స్ ను పూర్తి చేయడానికి ఏడాదికి పైగా సమయం పడుతుంది.

మరి వచ్చే ఎలక్షన్స్ కు సన్నద్ధమవడానికి ఏడాదికి పైన సమయం కావాలి. ఈ లెక్కలను బట్టి చూస్తే పవన్ ఈ మూడు చిత్రాలు కాకుండా ఎక్కువ సినిమాలు చేసే అవకాశం కనిపించట్లేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో.


Recent Random Post: