పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు వల్లమాలిన అభిమానం. తన బాబాయ్ అంటే ఎంత ప్రేమ ఉందో చాలా సార్లు బహిరంగంగానే ప్రకటించాడు చరణ్. పవన్ కు కూడా చరణ్ అంటే ప్రేమ ఎక్కువే. ఇప్పటికీ ఇద్దరి మధ్య చాలా సఖ్యత ఉంది. గతంలో పవన్ కళ్యాణ్, చరణ్ మీద ఉన్న ప్రేమతోనే ఒక సూపర్ హిట్ కథను చరణ్ కు రిఫర్ చేసాడు. వివరాల్లోకి వెళితే..
గతంలో స్టార్ దర్శకుడు వివి వినాయక్ నాయక్ స్క్రిప్ట్ ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు నరేట్ చేసాడు. పవన్ కళ్యాణ్ కు ఆ కథ విపరీతంగా నచ్చేసింది. అయితే కారణాలు తెలియదు కానీ ఈ సినిమాను తాను చేయలేనని చెప్పాడు. అయితే అదే స్క్రిప్ట్ ను రామ్ చరణ్ కు రిఫర్ చేసాడు పవన్ కళ్యాణ్. డివివి దానయ్య నిర్మాణంలో సినిమా తెరకెక్కింది. రిజల్ట్ అందరికీ తెలిసిందే. అలా చరణ్ కు ఒక సూపర్ హిట్ సినిమా రావడంలో పవన్ ప్రధానమైన పాత్రను పోషించాడు.
కట్ చేస్తే ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా పవన్ కళ్యాణ్ తన బ్యానర్ లో సినిమాను నిర్మించనున్నాడు. అయితే దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.
Recent Random Post: