మెగా బ్రదర్స్ ఇక సమ్మర్ పైనే దృష్టి పెట్టారు

లాక్ డౌన్ సమయంలో మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరూ సంక్రాంతి రేసులో నిలబడతారు అని వార్తలు వచ్చాయి. చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చేస్తుండగా, పవన్ కళ్యాణ్ వేణుశ్రీరామ్ దర్శకత్వంలో పింక్ రీమేక్ వకీల్ సాబ్ చేస్తున్నాడు. మెగా బ్రదర్స్ ఇద్దరూ సంక్రాంతి బరిలో తలపడతారు అన్న వార్త మెగా అభిమానులకు అటు టెన్షన్ ను ఇటు ఆసక్తిని కలిగించింది.

అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ రెండు సినిమాలు సంక్రాంతికి విడుదల కావడం అనేది దాదాపు అసాధ్యమని తేలిపోయింది. ఎందుకంటే ఆచార్య షూటింగ్ ఇంకా 70 శాతానికి పైగా చేయాలి. సెప్టెంబర్ నుండే షూటింగ్ ను మొదలుపెట్టినా కానీ సంక్రాంతికి సినిమాను తీసుకురావడం అనేది జరగని పని. అందుకే ఆచార్య ఇప్పుడు సమ్మర్ 2021 రిలీజ్ ను టార్గెట్ చేస్తోంది.

మరోవైపు వకీల్ సాబ్ మరో 30 రోజులు షూటింగ్ చేస్తే పూర్తైపోతుంది కానీ ఇటీవలే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాను కరోనా కేసులు పూర్తిగా తగ్గితే కానీ షూటింగ్ మొదలుపెట్టనని క్లారిటీ ఇచ్చాడు. సో ఇప్పుడిప్పుడే వకీల్ సాబ్ షూటింగ్ మొదలవ్వదు. అందుకే దిల్ రాజు ముందుగానే సమ్మర్ రిలీజ్ పై కర్చీఫ్ వేయడానికి నిశ్చయించుకున్నట్లు సమాచారం.


Recent Random Post: