పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. వచ్చే రెండేళ్ల వరకూ పవన్ కళ్యాణ్ వరసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా షూటింగ్ లో నటిస్తోన్న పవన్ కళ్యాణ్ తర్వాత ఏకంగా నాలుగు సినిమాలను లైన్లో పెట్టాడు. తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ మరో సినిమాను కూడా ఒప్పుకునే అవకాశాలు ఉన్నాయి.
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు ఎప్పటినుండో పవన్ ను డైరెక్ట్ చేయాలన్నది కల. అందుకోసం ఎప్పటినుండో ప్రయత్నాలు చేస్తున్నాడు. రీసెంట్ గా జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ కు ఒక కథ వినిపించాడట. పవన్ కు కూడా అది నచ్చడంతో డెవలప్ చేయమని కుదిరితే తప్పకుండా సినిమా చేద్దామని మాట ఇచ్చాడట పవర్ స్టార్. సో, ఫుల్ ఉత్సాహంతో జానీ మాస్టర్ ఈ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ ను ఫుల్ స్క్రిప్ట్ గా మలిచే పనిలో పడినట్లు తెలుస్తోంది.
మరి ఇప్పటికే ఫుల్ బిజీగా ఉన్న పవన్ ఈ సినిమాను ఎప్పుడు పూర్తి చేసాడన్నది ఆసక్తికరమే.
Recent Random Post:

















