ఫోటోటాక్ : గాలి నాగేశ్వరరావుతో పాయల్ చిలిపి చేష్టలు

మంచు విష్ణు గాలి నాగేశ్వరరావు పాత్రలో నటిస్తున్న చిత్రం షూటింగ్ చకచక జరుగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో హీరో మంచు విష్ణు తో పాటు సన్నీ లియోన్.. పాయల్ రాజ్ పూత్ కూడా పాల్గొంటున్నారు.

షూటింగ్ మాట అలా ఉంచి ఇద్దరు హీరోయిన్స్ తో మంచు విష్ణు చేస్తున్న ఫన్ వీడియోలు ఆకట్టుకుంటున్నాయి. సోషల్ మీడియాలో మంచు విష్ణు వీడియో లు తెగ వైరల్ అవుతున్నాయి.

ఆమద్య మంచు విష్ణు మరియు సన్నీ లియోన్ యొక్క కిచెన్ వీడియో వైరల్ అయిన విషయం తెల్సిందే. తాజాగా మరోసారి ఇద్దరు హీరోయిన్స్ తో మంచు విష్ణు చేసిన సందడి వీడియో కూడా వైరల్ అయ్యింది. మంచు విష్ణు ను ఇద్దరు హీరోయిన్స్ కలిసి ఫన్ గా కొట్టే వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. సినిమా ప్రమోషన్ లో ఇదో భాగం అన్నట్లుగా అయ్యింది.

ఇక పాయల్ రాజ్ పూత్ ఈ ఫోటోను షేర్ చేసింది. మార్నింగ్ షూట్ సమయంలో ఇలాగే ఉంటుంది అన్నట్లుగా మంచు విష్ణు తో చిలిపి పనులు చేస్తూ ఫోటో కు ఫోజ్ ఇచ్చింది. అల్లరి పాయల్ రాజ్ పూత్ తో మంచు విష్ణు రొమాన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని యూనిట్ సభ్యులు అంటున్నారు.

పాయల్ మరియు సన్నీ లియోన్ లు ఇద్దరు కూడా లంగా ఓణి ల్లో కనిపిస్తూ సినిమా మొత్తం కూడా ఒక మంచి ఫీల్ ను కలుగజేస్తారు అనిపిస్తుంది. ఇప్పటికే సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈమద్య కాలంలో మంచు వారి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతున్నాయి.

ఆ సెంటిమెంట్ ను ఈ సినిమా బ్రేక్ చేస్తుందేమో చూడాలి. ఈ సినిమా టైటిల్ విషయం లో త్వరలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి గాలి నాగేశ్వరరావు అంటూ సినిమాను పబ్లిసిటీ చేస్తున్నారు.