ఇంతకీ ప్రభాస్ డార్లింగ్ ఎవరంటే… ?

డార్లింగ్ అంటూ అందరినీ ప్రేమగా పిలిచే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చివరికి తానే అందరికీ డార్లింగ్ అయిపోయారు. ప్రభాస్ ఈ ఊతపదమే పూరీ జగన్నాధ్ ఒక సినిమాలో పెట్టేసి ప్రభాస్ చేతే బహు చక్కగా పలికించేశాడు. ఇక డార్లింగ్ టైటిల్ తో సినిమాయే చేశాడు ప్రభాస్. అంతలా డార్లింగ్ కి కనెక్ట్ అయిపోయాడు ఈ రెబెల్ స్టార్. ప్రభాస్ బర్త్ డే అక్టోబర్ 23. మరి సింగిల్ గా సోలోగా పుట్టిన రోజులు అన్నీ జరుపుకుంటూ వస్తున్న ప్రభాస్ కి అసలు సిసలు డార్లింగ్ ఇంతకీ ఎవరూ అని ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు అంతా చాలా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

నాలుగు పదులు వయసు దాటిన ప్రభాస్ ఇక ఒక ఇంటివాడు కావాల్సిందే అంటున్నారు ఫ్యాన్స్. ప్రభాస్ అయితే సినిమాల మీద సినిమాలు వరసబెట్టి చేసుకుంటూ పోతున్నారు. బాహుబలి పూర్తి అయ్యాక ప్రభాస్ పెళ్ళి అని అప్పట్లో ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగింది. కానీ ఆ తరువాత సాహో అన్నాడు ఇపుడు రాధే శ్యామ్ అంటున్నాడు ఇక సలార్ తో ఆదిపురుష్ వైజయంతి మూవీస్ సినిమాతో పాటు మరో కొత్త సినిమా కూడా కమిట్ అయినా ప్రభాస్ ఇప్పట్లో పెళ్లి ఊసు ఎత్తడు అనే మాట వినిపిస్తోంది.

ఈ మూవీస్ అన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తయారవుతున్నాయి. మరి ఇవన్నీ పూర్తి కావాలంటే ఎంత టైమ్ పడుతుందో కూడా ఎవరికీ తెలియదు మొత్తానికి పండుగంత వెన్నెల లాంటి వయసు అంతా ప్రభాస్ ఇలా సినిమా షూటింగుల్లో కరిగించేస్తున్నాడు అన్న బాధ ఫ్యాన్స్ కి చాలానే ఉంది. దీని మీద ప్రభాస్ పెదనాన్న రెబెల్ స్టార్ క్రిష్ణంరాజు అయితే ప్రభాస్ తప్పకుండా పెళ్ళి చేసుకుంటాడు అంటున్నారు. అది ఎపుడు అంటే చెప్పలేనని చెబుతూనే చేసుకుంటే తాము చూసిన అమ్మాయినే తప్ప సినిమా పరిశ్రమకు సంబంధించిన వారిని కానే కాదని కూడా అంటున్నారు.

మరో విషయం ఏంటి అంటే ప్రభాస్ కి పెళ్ళి సంబంధాలు చూస్తూ ఆయన పెద్దమ్మ క్రిష్ణం రాజు సతీమణి ఫుల్ బిజీగా ఉన్నారట. ప్రభాస్ ఎపుడంటే అపుడే పెళ్ళి చేసేస్తామని క్రిష్ణంరాజు ఫ్యామిలీ చెబుతోంది. మరి ప్రభాస్ మాత్రం నోరు విప్పడంలేదు ఇంతకీ డార్లింగ్ మదిలో ఎవరున్నారు అందరినీ డార్లింగ్ అంటూ ప్రేమ చూపించే ప్రభాస్ అసలైన డార్లింగ్ ఎవరు అన్నదే చర్చ. మొత్తానికి ఈ పుట్టిన రోజున అయినా ప్రభాస్ నుంచి పెళ్ళి ప్రకటన వస్తుందా అన్నదే చర్చగా ఉంది మరి.