పాపం ప్రభాస్ కష్టాలు వర్ణణాతీతం

సినిమా ఇండస్ట్రీలో స్టార్ డమ్ ను దక్కించుకోవడం ఎంత కష్టమో.. దాన్ని కాపాడుకునేందుకు అంతకు మించి కష్టపడాల్సిందే. సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు కోట్లకు కోట్ల పారితోషికాలు తీసుకుంటారు అనుకుంటారు కాని.. వారు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. యాక్షన్ సన్నివేశాల కోసం ఒల్లు హూనం చేసుకోవాలి. ప్రస్తుతం సలార్ సినిమా కోసం ప్రభాస్ చాలా కష్టపడుతున్నాడంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

కేజీఎఫ్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ సినిమా షూటింగ్ చకచక జరుగుతోంది. కేజీఎఫ్ 2 ప్రమోషన్ సమయంలో 30 శాతం షూటింగ్ ముగించినట్లుగా దర్శకుడు ప్రశాంత్ నీల్ పేర్కొన్నాడు. ఇటీవలే ఒక మేకింగ్ వీడియోను షేర్ చేసి మళ్లీ షూటింగ్ ను మొదలు పెట్టినట్లుగా చెప్పుకొచ్చాడు. నైట్ షూట్స్ తో పాటు భారీ యాక్షన్ సన్నివేశాలను ప్రస్తుతం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

సలార్ లో కేజీఎఫ్ కు మించిన యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నట్లుగా యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ప్రభాస్ సలార్ సినిమా కోసం వెయిట్ తగ్గుతున్నాడట. రెండు విభిన్నమైన పాత్రల్లో ప్రభాస్ కనిపించబోతున్నాడు.

మొదట కాస్త ఎక్కువ వెయిట్ ఉన్న పాత్రకు సంబంధించిన సూటింగ్ జరిగింది. ఇప్పుడు బరువు తక్కువ ఉన్న పాత్రకు సంబంధించిన షూట్ ను నిర్వహిస్తున్నారు.

దాదాపుగా నెల రోజుల పాటు వర్కౌట్స్ చేసి బరువు తగ్గినట్లుగా చెబుతున్నారు. ప్రభాస్ బరువు తగ్గడం కోసం చాలా కష్టపడ్డాడు అంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మొత్తానికి మరో కేజీఎఫ్ రేంజ్ హిట్ కోసం దర్శకుడు ప్రశాంత్ నీల్ చాలా అంటే చాలా ప్రభాస్ ను ఇబ్బంది పెడుతున్నాడు. ప్రభాస్ గతంలో బాహుబలి కోసం ఎలా అయితే కష్టపడ్డాడో అలా కష్టపడుతున్నాడు.

ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా తో నిరాశ పర్చాడు. సాహో మరియు రాధేశ్యామ్ ప్లాప్ అయినా కూడా ప్రభాస్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. బాక్సాఫీస్ వద్ద ఆయన హడావుడి అంతా ఇంతా కాదు. ఉత్తర భారతంలో కూడా మంచి ఆదరణ ప్రభాస్ కు ఉంది. అందుకే కాస్త పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంటే చాలు అక్కడ ఇక్కడ భారీగా వసూళ్లు నమోదు అవ్వడం ఖాయం.