నెట్టింట్లో వైరల్ అవుతున్న ప్రభాస్ అరుదైన ఫొటో

స్టార్ హీరోల ఫొటో కొత్తది రిలీజ్ చేసినా అభిమానులకు పండగే. సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ సంబరాలు చేస్తారు. అదే.. తమ హీరోకు సంబంధించి ఏదైనా అరుదైన ఫొటో వస్తే.. అది పాతదే అయినా మరింత వైరల్ చేస్తూ సంబరాలు చేస్తారు. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ కు సంబంధించి 15 ఏళ్ల క్రితం నాటి ఒక ఫొటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈఫొటోలో ప్రభాస్ విశ్వామిత్రుడి గెటప్ లో ఉండటమే ఇందుకు కారణం. 2007లో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన యమదొంగ సినిమాను విశ్వామిత్ర క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కించారు.

ఈ బ్యానర్ కోసం ప్రభాస్ ను విశ్వామిత్రుడిగా మార్చేశారు రాజమౌళి. సినిమాలో కూడా ప్రభాస్ విశ్వామిత్రుడిగా బ్యానర్ లోగో ఎంట్రీలో కనిపిస్తారు. ప్రస్తుతం ఆ ఫొటోనే ఇప్పుడు వైరల్ అయింది. ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో నటిస్తున్నారు. రాధేశ్యామ్ కూడా షూటింగ్ దశలో ఉంది. తర్వాత సలార్ షూటింగ్ లో జాయిన్ కానున్నారు.