ప్రభాస్‌, సుధ కొంగర కాంబోలో…!

ఆల్ ఇండియా సూపర్‌ స్టార్‌ ప్రభాస్ ప్రస్తుతం చేతిలో పలు భారీ ప్రాజెక్ట్‌ లను పట్టుకుని ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా చేసుకుంటూ వెళ్తున్నాడు. రాధే శ్యామ్‌ సినిమా త్వరలో విడుదల కాబోతుంది. మరో వైపు ఆది పురుష్ మరియు సలార్‌ మూవీ ల్లో నటిస్తున్నాడు. ఈ మూడు కాకుండా త్వరలోనే ప్రభాస్ హీరోగా నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో సినిమా ప్రారంభం కాబోతుంది. ఇక బాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్ సిద్దార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో కూడా ప్రభాస్ సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలోనే ప్రభాస్‌ కు సుధా కొంగర కథ చెప్పారనే వార్తలు వస్తున్నాయి.

తమిళ హిట్‌ మూవీ సూరారై పోట్రూ తెలుగులో ఆకాశమే నీ హద్దురా ను తెరకెక్కించిన సుధా కొంగర ఒక్కసారిగా మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్ గా పేరు దక్కించుకుంది. ఆ సినిమా తర్వాత పలువురు తమిళ హీరోలు మరియు తెలుగు హీరోలు కూడా సుధా కొంగరను ప్రశంసించారు. అంతే కాకుండా సుధా కొంగరతో సినిమా ను చేసేందుకు సిద్దంగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు. ఈ సమయంలోనే సుధా కొంగర ఒక ఇంట్రెస్టింగ్‌ స్టోరీ లైన్‌ ను ప్రభాస్‌ కు వినిపించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రభాస్‌ కు కూడా ఆ స్టోరీ లైన్ నచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ 2023 లో పట్టాలెక్కే అవకాశం ఉందని కూడా టాక్‌. అధికారికంగా కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.