15 రకాల బిర్యానీలు తెప్పించుకు తినేవాడిని

ప్రభాస్‌ బాహుబలి కోసం ఎంత కష్టపడ్డాడో చిన్న పిల్లల నుండి పెద్ద వారి వరకు అందరికి తెలుసు. సినిమాలో రెండు పాత్రల్లో ప్రభాస్‌ కనిపించాడు. ఆ రెండు పాత్రల వేరియేషన్‌ కోసం ప్రభాస్‌ బరువు పెరగడంతో పాటు తగ్గడం కూడా చేశాడు. రెండు పాత్రల్లో కూడా ప్రభాస్ కనిపించిన తీరు అద్బుతం. ప్రభాస్ బరువు పెరగడం కోసం రోజు 40 కొడిగుడ్లు తినేవాడట. ప్రతి రోజు అన్ని కోడిగుడ్లు మాత్రమే తినేవాడిని. కాస్త డైట్ కు బ్రేక్‌ దక్కితే బిర్యనీ లాగించేవాడిని. ఒకేసారి 15 రకాల బిర్యానీలను తెప్పించుకుని తినేవాడిని.

బాహుబలి సినిమా కోసం ఎక్కువగా వ్యాయామం చేసేవాడిని. ఆ సమయంలో ప్రతి సారి జిమ్ కు వెళ్లడం కష్టం అవ్వడంతో ఇంట్లోనే కోటిన్నర పెట్టి జిమ్‌ ను ఏర్పాటు చేయించాను. నేను బాహుబలి కి పడ్డ కష్టం వృదా కాలేదు. ఇక హిందీ సినిమాల్లో నాకు త్రి ఇడియట్స్ మరియు మున్నాబాయ్ ఎంబీబీఎస్ సినిమాలు ఇష్టం. ఆ సినిమాలకు దర్శకత్వం వహించిన రాజ్‌ కుమార్‌ హిరానీ తో సినిమా చేయాలని కోరుకుంటున్నాను. మరి ఆ అవకాశం వస్తుందో లేదో చూడాలి.