ఆర్మీ ఆఫీసర్ పాత్రలో ప్రభాస్?

రెబల్ స్టార్ ప్రభాస్ కు ఇప్పుడు దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపు ఉన్న విషయం తెల్సిందే. దానికి తగ్గట్లుగానే ప్రభాస్ వరసగా నాలుగు ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ ను సెట్ చేసాడు. రాధే శ్యామ్ తర్వాత ప్రభాస్ నటిస్తోన్న మరో సినిమా సలార్. కేజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రం రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది.

కరోనా పరిస్థితుల కారణంగా ఈ చిత్ర షూటింగ్ ను నిలిపివేశారు. ఇదిలా ఉంటే సలార్ గురించి తాజాగా వస్తోన్న అప్డేట్స్ ప్రభాస్ అభిమానులను సంతోషపరుస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం సలార్ లో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తాడట. అందులో ఒకటి ఆర్మీ ఆఫీసర్ రోల్ కాగా మరొకటి సస్పెన్స్ అని తెలుస్తోంది. ముఖ్యంగా ఆర్మీ ఆఫీసర్ రోల్ ను చాలా పవర్ఫుల్ గా తీర్చిదిద్దాడట ప్రశాంత్ నీల్.