
బాహుబలి చిత్రం కోసం నాలుగేళ్లు కేటాయించిన ప్రభాస్ తన తదుపరి చిత్రాల విషయంలో కాస్త కన్‌ఫ్యూజన్‌కి గురవుతున్నాడు. తన తదుపరి చిత్రానికి ఎక్కువ గ్యాప్ వుండకూడదని ప్రభాస్ అనుకుంటున్నాడు. కానీ సుజిత్ ప్లాన్ చేసిన యాక్షన్ చిత్రం అంత త్వరగా పూర్తయ్యేట్టు లేదు.
ఎంత పకడ్బందీ షెడ్యూల్ వేసుకున్నా కానీ ఇది పూర్తి కావడానికి ఏడాది పడుతుందట. యాక్షన్ దృశ్యాలకే వంద రోజులకి పైగా కాల్షీట్లు కావాలట. అందుకే దీంతో పాటు ప్యారలల్‌గా మరో సినిమా చేయాలని ప్రభాస్ అనుకుంటున్నాడని, కానీ రెండు సినిమాలు ఒకేసారి మొదలు పెట్టడం కరక్టేనా అని ఆలోచిస్తున్నాడని మరో వార్త వినిపిస్తోంది. జిల్ దర్శకుడు రాధాకృష్ణ కూడా ప్రభాస్‌కి మంచి కథ చెప్పాడట. దానికి ఎక్కువ టైమ్ పట్టదని, ఆర్నెల్లలో పూర్తవుతుందని అంటున్నారు.
ఈ రెండు చిత్రాలని సమాంతరంగా చేస్తూ ఏది ముందు సిద్ధమైతే దానిని విడుదల చేయాలని, లేదా వచ్చే ఏడాదిలోనే మూడు నెలల వ్యవధిలో రెండిటినీ వదలితే ఎలాగుంటుందని ఆలోచిస్తున్నారని తెలిసింది. ప్రస్తుతానికి సుజిత్ సినిమా ‘సాహో’ కోసం ఒక టీజర్ షూట్ చేసారు. బాహుబలితో పాటుగా ఈ టీజర్ రిలీజ్ చేస్తారు. దీనికి వచ్చే స్పందనని బట్టి తదుపరి చిత్రంపై ఒక క్లారిటీకి రావాలని ప్రభాస్ భావిస్తున్నాడట. సాహో కనుక జాతీయ వ్యాప్తంగా ఆసక్తి రేపినట్టయితే ఇక ప్యారలల్‌గా ఏమీ పెట్టుకోకుండా ముందుగా ఇదే చేస్తాడట. అదండీ సంగతి.
Recent Random Post:

















