బాహుబలి తేడా వచ్చి ఉంటే..

తన కెరీర్లో ‘బాహుబలి’కి భయపడినంతగా మరే సినిమాకూ భయపడలేదంటున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. రాజమౌళి ఈ సినిమా కథ చెప్పినపుడు.. సినిమా మొదలైనపుడు చాలా కాన్ఫిడెంట్‌గానే ఉన్నానని.. కానీ సినిమా ముగింపు దశకు వచ్చేటప్పటికి ఫలితం విషయంలో భయం పట్టుకుందని ప్రభాస్ అన్నాడు. ‘బాహుబలి: ది బిగినింగ్’ అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినప్పటికీ నిర్మాతలకు పెద్దగా మిగిలిందేమీ లేదని.. అదే కనుక ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చని ప్రభాస్ అన్నాడు.

”బాహుబలి: ది బిగినింగ్ షూటింగ్‌కి ఒక స్కూల్ పిల్లాడి లాగా పద్ధతిగా వెళ్లాను. ఏ చిన్న తేడా వచ్చినా చాలా నష్టం వస్తుంది. ఒక సీన్ రీషూట్ చేయాలంటే మళ్లీ అంతా సెట్ చేయడానికి 3-4 గంటలు పట్టేది. ఖర్చు కూడా చాలా ఉండేది. అందుకే చాలా జాగ్రత్తగా ఉన్నాను. ఇక సినిమా పూర్తయ్యే దశలో రిజల్ట్ గురించి భయం పట్టుకుంది. ఈ సినిమా సూపర్ హిట్టయినా నిర్మాతలకు మామూలు కష్టం ఉండదు.

బ్లాక్ బస్టర్ అయితేనే నిర్మాతలకు ఏమీ మిగల్లేదంటే అర్థం చేసుకోవచ్చు. రిజల్ట్ తేడా వస్తే నేను.. రాజమౌళి గారు అదే నిర్మాతలకు ఇంకో మూడు సినిమాలు చేయాల్సి వచ్చేది. ఇక రెండో భాగం కోసం అప్పటికే కొంత భాగం షూట్ చేసి పెట్టాం కాబట్టి.. మొదటిది తేడా వస్తే అదంతా వేస్టయ్యేది. రెండో భాగం ఉండేదే కాదు. ఇలా ఎన్నెన్నో టెన్షన్ల మధ్య ‘బాహుబలి: ది బిగినింగ్’ ఫలితం కోసం ఎదురు చూశాను. అదృష్టవశాత్తూ మేం అనుకున్నదానికంటే సినిమా పెద్ద విజయం సాధించింది” అని ప్రభాస్ అన్నాడు.

 


Recent Random Post: