
నందమూరి బాలకృష్ణతో సినిమా గురించి అనౌన్స్‌మెంట్ ఇచ్చిన మరుసటి రోజే ఈ చిత్రం కోసం 12 మంది నటీనటులు కావాలంటూ కాస్టింగ్ కాల్ ఇచ్చి పెద్ద సెన్సేషనే క్రియేట్ చేశాడు పూరి జగన్నాథ్. ఏదో కొత్త నటీనటులతో సినిమా తీస్తున్నట్లుగా ఇలా కాస్టింగ్ కాల్ ఇవ్వడమేంటి అని అందరూ ఆశ్చర్యపోయారు. బాలయ్యకు తెలియకుండానే పూరి ఈ కాస్టింగ్ కాల్ ఇచ్చాడని.. దీంతో బాలయ్య సీరియస్ అయ్యాడని కూడా గుసగుసలు వినిపించాయి. ఐతే మధ్యలో ఏం జరిగిందో ఏమో కానీ.. బాలయ్య సినిమాకు కొత్త నటీనటుల్ని ఎంచుకునే విషయంలో పూరి వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది.
బాలయ్య లాంటి స్టార్ హీరో సినిమాకు నటీనటుల ఎంపిక పెద్ద విషయం కాదు. పాత్రలకు తగ్గట్లుగా నటీనటుల్ని ఎంపిక చేసే వ్యక్తులు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. ముంబయిలో కాస్టింగ్ ఏజెన్సీలను అడిగితే ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్టుల్నే అందుబాటులోకి తెస్తారు. ఇక సౌత్ ఇండస్ట్రీల్లో నటీనటులకా కొదవ. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్త నటీనటుల్ని ఎంపిక చేసుకుని వాళ్లను ట్రైన్ చేసుకుని సినిమా తీయాలంటే చాలా ఆలస్యమవుతుందని భావించి.. పూరి వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
కాస్టింగ్ కాల్‌కు స్పందించి అప్లికేషన్లు పంపిన వాళ్లకు ఇంటర్వ్యూలు చేసి ‘పూరి కనెక్ట్స్’ ద్వారా వేరే సినిమాలకు కావాలంటే ఉపయోగించుకోవవచ్చని భావిస్తున్నారట. ఈ బాధ్యతల్ని ఛార్మికి అప్పగించేసి పూరి.. బాలయ్య సినిమా కోసం వేరే నటీనటుల్ని ఎంచుకునే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. కాస్టింగ్ కాల్‌కు స్పందించిన వాళ్లలోంచి కుదిరితే ఒకరిద్దరిని తీసుకునే అవకాశముందేమో కానీ.. మొత్తంగా 12 మంది కొత్తవాళ్లను మాత్రం ఈ సినిమాకు తీసుకునే ఛాన్సే లేదని సమాచారం.
Recent Random Post: