పుష్ప కోసం అడల్ట్ స్టార్ ను దించుతున్నారా?

సుకుమార్ సినిమాలు అనగానే ఐటెం సాంగ్ లకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఆర్య నుండి మొదలుపెట్టి రంగస్థలం వరకూ సుక్కూ ఐటమ్ సాంగ్ పెట్టాడంటే అది సూపర్ హిట్ అవ్వాల్సిందే. అలాగే ఇప్పుడు సుకుమార్ డైరెక్ట్ చేస్తోన్న పుష్పలో కూడా ఒక అదిరిపోయే ఐటెం సాంగ్ ఉందిట.

దేవి శ్రీ ప్రసాద్ ఒక అదిరిపోయే ట్యూన్ ను సిద్ధం చేసి రికార్డింగ్ కూడా పూర్తి చేసాడట. మరి ఈ సాంగ్ లో ఎవరు నటిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. బాలీవుడ్ హాట్ భామ దిశా పటాని ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేస్తుందని వార్తలు వచ్చాయి కానీ ఇప్పుడు అడల్ట్ స్టార్ గా ఒక వెలుగు వెలిగి బాలీవుడ్ లో స్థిరపడిన సన్నీ లియోన్ ను సంప్రదించినట్లు చెబుతున్నారు.

ఈ సాంగ్ చేయడానికి సన్నీ లియోన్ ఏకంగా 70 లక్షల రూపాయల పారితోషికాన్ని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.