రాధే శ్యామ్ రిలీజ్ కు కూడా రెండు డేట్లు!!

రెబెల్ స్టార్ ప్రభాస్ ప్యాన్ ఇండియా చిత్రం రాధే శ్యామ్ గత మూడేళ్ళుగా ప్రొడక్షన్ లో ఉండి గతేడాదే విడుదలకు సిద్ధమైంది. సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేద్దామని భావించారు కానీ అనుకోకుండా వచ్చిన థర్డ్ వేవ్ కారణంగా రాధే శ్యామ్ చిత్రం వాయిదా పడింది.

ఇక ఇప్పుడు కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. వస్తున్న కేసులు కూడా ప్రమాదకరంగా మారని నేపథ్యంలో సినిమాలు మళ్ళీ విడుదలలకు సిద్ధమవుతున్నాయి. థియేటర్లు పూర్తి స్థాయిలో నడవడం మొదలవ్వగానే రాధే శ్యామ్ ను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ఇందుకోసం ఆర్ ఆర్ ఆర్ తరహాలో రెండు రిలీజ్ డేట్లను అనుకుంటున్నారట. మార్చ్ 4 లేదా 11 న రాధే శ్యామ్ ను విడుదల చేయాలని భావిస్తున్నారు. పరిస్థితులు అనుకూలించినా కానీ ఆర్ ఆర్ ఆర్ ఏప్రిల్ లోనే వస్తుందన్న సంకేతాలు ఉన్న నేపథ్యంలో ఆ రిలీజ్ డేట్స్ నే పక్కా చేయాలని అనుకుంటున్నారు.