కోవిడ్ కేర్‌ సెంటర్‌ గా మారిన రాధే శ్యామ్‌ ఆసుపత్రి సెట్టింగ్

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్‌ సినిమాలో నటిస్తున్నాడు. సినిమాలో కీలకమైన సన్నివేశాల కోసం రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఒక ఆసుపత్రి సెట్టింగ్ ను నిర్మించారు. 1980 ల్లో ఇటలీలో ఆసుపత్రి ఎలా ఉండేదో అలా నిర్మించారు. ఆసుపత్రి సెట్టింగ్‌ కోసం దాదాపుగా 50 రియల్‌ బెడ్‌ లు మరియు కొన్ని స్ట్రెచ్చర్స్‌ ను కూడా కూడా వీరు కొనుగోలు చేయడం జరిగింది. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న ఈ సమయంలో రాధే శ్యామ్‌ చిత్ర యూనిట్‌ సభ్యులు ఆ బెడ్స్ ను డొనేట్ చేసేందుకు ముందుకు వచ్చారు.

కోవిడ్ సెంటర్‌ లో ఆ బెడ్స్‌ మరియు ఇతర అవసరాలకు సంబంధించిన పరికరాలను చిత్ర యూనిట్‌ సభ్యులు ఇవ్వడం జరిగిందట. కోవడ్ సెంటర్ కోసం ప్రభాస్‌ చిత్ర యూనిట్‌ సభ్యులు తమ వంతు సహకారం అందించడం అభినందనీయం. ఈ ఏడాది ప్రభాస్‌ రాధే శ్యామ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. పాట మినహా షూటింగ్ పూర్తి అయ్యింది. అందుకే ఆసుపత్రి సెట్టింగ్‌ ను తొలగించారని సమాచారం అందుతోంది. పూజా హెగ్డే హీరోయిన్‌ గా యూవీ క్రియేషన్స్‌ లో ఈ సినిమా రూపొందుతోంది. ఇటలీ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని చిత్ర యూనిట్‌ సభ్యులు అంటున్నారు.