మహేష్-జక్కన్న మూవీ.. అదే నిజమైతే అద్భుతమే

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఇటీవలే ఆర్ ఆర్ ఆర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో తదుపరి సినిమా విషయంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మహేష్ బాబు తో రాజమౌళి తదుపరి సినిమా చేయబోతున్న విషయం ఇప్పటికే క్లారిటీ వచ్చింది. మహేష్ తో రాజమౌళి చేయబోతున్న సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా దాదాపుగా ఒక కొలిక్కి వచ్చిందనే వార్తలు వస్తున్నాయి.

ఈ సమయంలోనే బాహుబలి రేంజ్ లో మహేష్ బాబు సినిమా కోసం పవర్ ఫుల్ విలన్ పాత్రను డిజైన్ చేశాడట. జక్కన్న సినిమాలోని ప్రతి ఒక్క సన్నివేశం మరియు పాత్ర కూడా చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. కథ లో భాగం అన్నట్లుగా ఉంటుంది. అందుకే ఆయన మహేష్ బాబు సినిమా కోసం ఒక కీలక పాత్ర కోసం యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ ను రంగంలోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడట.

ఇటీవలే ప్రశాంత్ నీల్ తన తదుపరి సినిమా ను ఎన్టీఆర్ తో చేయబోతున్నాడు. ఆ సినిమా కోసం కమల్ హాసన్ ను ఎంపిక చేసే విషయమై చర్చలు జరుపుతున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలోనే మహేష్ బాబు సినిమా కోసం కూడా రాజమౌళి కీలక పాత్ర కోసం కమల్ హాసన్ ను నటింపజేయాలని అనుకోవడం తో ఒక్క సారిగా అందరి దృష్టి కూడా కమల్ హాసన్ పై పడింది.

ఆయన నటించిన విక్రమ్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమా విడుదల తర్వాత కమల్ సినిమాలతో మళ్లీ బిజీ అవుతాడనే నమ్మకంను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. చాలా సంవత్సరాలుగా కమర్షియల్ హిట్స్ లేకపోవడంతో కమల్ హాసన్ కాస్త ఢీలా పడ్డా.. ఆయన స్టార్ డమ్ ఏమాత్రం తగ్గలేదు అనేది విక్రమ్ సినిమా బజ్ చూస్తే అర్థం అవుతుంది.

విక్రమ్ సినిమా సక్సెస్ అయితే ఖచ్చితంగా మహేష్ బాబు సినిమా లో లేదా ఎన్టీఆర్ సినిమాలో అయినా ఆయన కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

రాజమౌళి సినిమా ఖచ్చితంగా భారీ పాన్ ఇండియా మూవీ అవుతుంది. కనుక ఆ సినిమా లో కమల్ హాసన్ నటిస్తే తప్పకుండా అదో అద్బుతం అవుతుందని.. మహేష్ బాబు మరియు కమల్ హాసన్ ను ఒకే స్క్రీన్ పై చూడ్డానికి రెండు కళ్లు కూడా సరిపోవు అన్నట్లుగా కామెంట్స్ వస్తున్నాయి.