
బాహుబలి చిత్రానికి ఎక్స్ట్రా షోస్‌కి పర్మిషన్ రావడం పట్ల రాజమౌళి ఆనందం వ్యక్తం చేసాడు. దీని వల్ల ఎక్కువ మంది చూడడానికి, తద్వారా రెవెన్యూ పెరగడానికి స్కోప్ వుంటుందని, బయ్యర్లు లాభపడతారని అన్నాడు.
అయితే ఈ పద్ధతి కేవలం బాహుబలికే పరిమితం చేయకుండా దీనిని చట్టబద్ధం చేయాలని, ఇకపై అన్ని సినిమాలకీ రోజుకి అయిదు షోలు వేయాలని కోరాడు. జనాభా తక్కువ వున్న రోజుల్లో నాలుగు ఆటలు వేసేవారని, కానీ అప్పటికీ ఇప్పటికీ థియేటర్ల సంఖ్య ఎక్కువగా పెరగకపోయినా, జనాభా మాత్రం చాలా పెరిగిపోయిందని, కనుక రోజుకి అయిదు ఆటలు వేయడం సముచితమని అభిప్రాయపడ్డాడు.
ఇకపై ఇది రెగ్యులరైజ్ అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేసాడు. ఇక బాహుబలి చిత్ర విజయానికి, ఈ క్రేజ్‌కి కారణం గ్రాఫిక్స్ కాదని, క్యారెక్టరైజేషన్స్ వల్లే ఈ చిత్రం ఇంతటి విజయాన్ని అందుకుందని, ఒక సినిమా చూసిన రెండేళ్ల తర్వాత కూడా ఆ పాత్రలు జనాల్లో వుండిపోయాయంటే దాని గొప్పతనం తన తండ్రి విజయేంద్రప్రసాద్దేనని, ఆయన సృష్టించిన పాత్రల చుట్టూనే తాను ఈ కథ అల్లానని, అవి లేకపోతే బాహుబలి ఇంతటి సంచలనం అయ్యేది కాదని తన తండ్రికి చాలానే క్రెడిట్ ఇచ్చాడు.
బాహుబలి తర్వాత ఏ సినిమా చేయాలనేది అస్సలు ఆలోచించలేదని, తనకి కాస్త విరామం అవసరమని, గ్యాప్ తర్వాతే ఏం చేయాలనేది డిసైడ్ అవుతానని చెప్పాడు.
Recent Random Post: