
వివాదాలతో తరచూ వార్తల్లోకి ఎక్కే బాలీవుడ్ సెక్స్ బాంబు రాఖీ సావంత్ ఇప్పుడు న్యాయపరమైన చిక్కుల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. వాల్మీకి రుషిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి.. లేని తలనొప్పిల్ని నెత్తికి చుట్టేసుకున్న అమ్మడిపై కోర్టులో కేసు బుక్ అయ్యింది. విచారణకు హాజరు కావాలన్న కోర్టు ఆదేశాల్ని లైట్ తీసుకొని ఇష్యూను మరింత పెద్దది చేసుకుంది. తాజాగా.. ఆమెపై అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తూ లూథియానా కోర్టు సమన్లు జారీ చేసింది.
దీంతో.. ఆమెను అరెస్ట్ చేస్తారన్న వాదనలు వినపించాయి. ఇదిలా ఉంటే.. తాజాగా.. ఆమెను అరెస్ట్ చేశారంటూ వార్తలు గుప్పుమన్నాయి. అయితే.. అలాంటిదేమీ లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు.. ఆమె ఎక్కడ ఉందన్నది బయటకు రావటం లేదు. ఆమె ఆచూకీ దొరకటం లేదని పోలీస్ కమిషనర్ కున్వర్ విజయ్ ప్రతాప్ సింగ్ స్పష్టం చేస్తున్నారు.
ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారన్న వార్తల్ని ఆయన ఖండిస్తున్నారు. దీంతో.. రాఖీ సావంత్ ఇప్పుడు ఎక్కడ ఉంది? ఏం చేస్తోంది? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. మరోవైపు ఆమెను అదుపులోకి తీసుకోవాలంటూ లూథియానా కోర్టు ఆదేశాల్ని ఎలా అమలు చేయాలన్నది ఇప్పుడు పోలీసు వర్గాలకు పెద్ద సమస్యగా మారింది. తన తీరుతో పోలీసులకు ముచ్చెమటలు పోయిస్తున్న రాఖీ.. రానున్న రోజుల్లో మరెన్ని సిత్రాలు చూపిస్తుందో..?
Recent Random Post: