చరణ్‌11… నాలుగు నెలల్లో గుమ్మడికాయ

తాపీగా సినిమాలు తీసే అలవాటున్న సుకుమార్‌ తన తాజా చిత్రానికి మాత్రం స్టోరీబోర్డ్‌తో సహా సెట్స్‌ మీదకి వెళుతున్నాడు. ఇప్పటికే లొకేషన్స్‌ అన్నిట్లో రెక్కీ వేసుకుని, ఎక్కడ ఏది తీయాలనేది ఫైనలైజ్‌ చేసేసారు. ఏప్రిల్‌ 1 నుంచి చరణ్‌11 షూటింగ్‌ మొదలు కానుంది.

రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ముప్పయ్‌ అయిదు రోజుల పాటు షూటింగ్‌ చేస్తారు. దీంతో టాకీ పార్ట్‌ అరవై శాతం వరకు పూర్తవుతుంది. తర్వాత పొల్లాచ్చికి వెళ్లి మిగతా భాగం టాకీని షూట్‌ చేసుకుని వస్తారు. అనంతరం పాటలు, రెండు ఫైట్ల చిత్రీకరణతో షూటింగ్‌ మొత్తం కంప్లీట్‌ అవుతుంది. సరిగ్గా నాలుగు నెలల్లో గుమ్మడికాయ కొట్టేస్తానని సుకుమార్‌ నిర్మాతలకి ఖచ్చితమైన షెడ్యూల్‌ వేసి ఇచ్చాడట. జులై నెలాఖరుకి షూటింగ్‌ మొత్తం కంప్లీట్‌ అవుతుందని, ఆగస్టులో పోస్ట్‌ ప్రొడక్షన్‌ చేసుకుని దసరాకి రిలీజ్‌ చేసుకోవచ్చునని చెప్పాడట.

మామూలుగా రోజుల తరబడి షూటింగ్‌ చేస్తూ, పర్‌ఫెక్షన్‌ కోసం తీసిందే తీసే అలవాటున్న సుకుమార్‌ తనపై వున్న బ్యాడ్‌ నేమ్‌ చెరిపేసుకోవాలని డిసైడ్‌ అయ్యాడట. ఇది సింపుల్‌ లవ్‌స్టోరీ కావడంతో, భారీ హంగులేమీ వుండవు కనుక త్వరగా పూర్తి చేసేయాలని ఫిక్సయ్యారు. ఈసారి దసరాకి చరణ్‌ సినిమా మిస్‌ కాదని ఫాన్స్‌ కూడా ఫిక్స్‌ అయిపోవచ్చు. ఈ పీరియడ్‌ లవ్‌స్టోరీలో తొలిసారి చరణ్‌ సరసన సమంత కథానాయికగా నటిస్తోంది.


Recent Random Post: