బాబాయ్ కంటే అబ్బాయే బెట‌ర్ బాసూ…

బాబాయ్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ కంటే అబ్బాయి రాంచ‌ర‌ణ్ బెట‌ర్ అనే వాద‌న వినిపిస్తోంది. చిత్తూరు జిల్లా కుప్పంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ ఫ్లెక్సీ కడుతూ ముగ్గురు అభిమానులు చనిపోయిన సంగతి తెలిసిందే. మృతుల కుటుంబాల‌కు ఆర్థిక సాయం అందించ‌డంలో బాబాయ్ కంటే అబ్బాయే ముందంజలో ఉన్నారు. ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.2 ల‌క్ష‌లు చొప్పున ఆర్థిక సాయం అందించాల‌ని పార్టీ కార్యాల‌య సిబ్బందిని జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఆదేశించారు.

అలాగే ప‌వ‌న్ న‌టిస్తున్న వ‌కీల్‌బాస్ చిత్ర యూనిట్‌తో పాటు పీఎస్‌పీకే 27 మూవీ సంస్థ తమ వంతుగా మృతుల కుటుంబాల‌కు రూ.2 ల‌క్ష‌లు ఆర్థిక సాయం అందిస్తామ‌ని ప్ర‌క‌టించాయి. అలాగే యంగ్ హీరో అల్లు అర్జున్ త‌న‌కెలాంటి సంబంధం లేక‌పోయినా…ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై అభిమానంతో ఒక్కో కుటుంబానికి రూ.2 ల‌క్ష‌లు ఇవ్వ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. దీంతో అల్లు అర్జున్‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా మెగాస్టార్ త‌న‌యుడు, యంగ్ హీరో రామ్‌చ‌ర‌ణ్ త‌న పెద్ద మ‌న‌సును చాటుకున్నాడు. మృతుల కుటుంబాల‌కు ఒక్కొక్క‌రికి రూ.2.50 లక్ష‌లు చొప్పున ఆర్థిక సాయం ఇవ్వ‌నున్న‌ట్టు ట్విట‌ర్ ద్వారా ప్ర‌క‌టించాడు. మ‌రణించిన వారి ప్రాణాల‌ను తిరిగి తీసుకు రాలేమ‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. క‌ష్ట స‌మ‌యంలో ఉన్న ఆ కుటుంబాల‌ను ఆదుకునేందుకు త‌న వంతు సాయం చేస్తున్న‌ట్టు రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌క‌టించాడు.

ఇదిలా ఉండ‌గా త‌న కోసం చ‌నిపోయిన వారికి ప‌వ‌న్ రూ.2 ల‌క్ష‌లు అందిస్తుంటే, త‌న‌కెలాంటి సంబంధం లేక‌పోయినా, బాబాయ్ అభిమానులు ప్రాణాలు కోల్పోయార‌నే ఆవేద‌న‌తో చ‌ర‌ణ్ ముందుకొచ్చి….బాబాయ్ కంటే అద‌నంగా రూ.50 వేలు ఇస్తుండ‌డం స‌ర్వ‌త్రా అభినంద‌న‌లు కురిపిస్తున్నారు.


Recent Random Post: