
రామ్ చరణ్ కొత్త సినిమాని దసరాకి విడుదల చేయాలని భావిస్తున్నారు కానీ ముందుగా దసరా బరిలోకి దిగిన ‘స్పైడర్’ వల్ల ప్లాన్స్ మార్చుకోవాల్సి వస్తుంది. దసరా సీజన్లో రెండు పెద్ద సినిమాలు ఒకేసారి విడుదలై విజయవంతం కావడం చాలా అరుదు కనుక ఈ భారీ బడ్జెట్ చిత్రంతో పోటీకి చరణ్, సుకుమార్‌ల చిత్ర నిర్మాతలు సాహసించకపోవచ్చు.
దసరా మిస్ అయితే నెక్స్ట్ బెస్ట్ సీజన్ సంక్రాంతి. కానీ ఈసారి సంక్రాంతికి పవన్‌కళ్యాణ్ సినిమా రావడం ఖాయంగా కనిపిస్తోంది. మొదట్లో దసరాకి విడుదల చేద్దామని అనుకున్నారు కానీ ఈ చిత్రానికి జరుగుతోన్న బిజినెస్‌ని దృష్టిలో వుంచుకుని హడావిడి పడడం దేనికని సంక్రాంతికి పవన్25ని వాయిదా వేసినట్టు అనధికారిక వార్తలు వస్తున్నాయి. చూస్తూ, చూస్తూ బాబాయ్‌తో పోటీకి వెళ్లలేడు కాబట్టి మరోసారి డిసెంబర్లోనే ఈ చిత్రం విడుదల చేసుకోవాల్సి వచ్చేలా వుంది.
ధృవ డిసెంబర్లో రావడం వల్ల సీజన్ ఎఫెక్ట్ కాస్త పడిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా చరణ్‌కి ఆ బాధ తప్పేట్టు లేదు. కాకపోతే సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఓవర్సీస్లో మంచి రెవెన్యూ సాధించే అవకాశముంటుంది. అక్కడ డిసెంబర్ థర్డ్ వీక్ బెస్ట్ సీజన్. అందులోను సుకుమార్ బ్రాండింగ్ కూడా వుండనే వుంది.
Recent Random Post:

















