ప్రభాస్ గురించి రానా ఏం చెప్పాడండీ

‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్‌కు వచ్చిన గుర్తింపు చూసి ఎవ్వరైనా అసూయ చెందాల్సిందే. ఈ సినిమాతో రానా దగ్గుబాటి సైతం గొప్ప పేరే సంపాదించాడు కానీ.. ప్రభాస్‌కు వచ్చిన గుర్తింపు మాత్రం అలాంటిలాంటిది కాదు. ముఖ్యంగా ‘బాహుబలి: ది కంక్లూజన్’ రిలీజయ్యాక ప్రభాస్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడతను నేషనల్ లెవెల్లో సూపర్ స్టార్.

స్వయంగా రానా కూడా ఒక హీరోనే కాబట్టి తనతో కలిసి నటించిన మరో హీరోకు వస్తున్న గుర్తింపు చూసి లోలోన కొంత అసూయ ఉంటుందేమో అనుకుంటాం. ఐతే రానా మాత్రం అలాంటి ఆలోచనలేమీ పెట్టుకోకుండా ప్రభాస్‌ను ఉద్దేశించి తన ఇన్‌స్టా‌గ్రామ్ అకౌంట్లో పెట్టిన పోస్టు శభాష్ అనిపిస్తోంది. ప్రభాస్‌ను మనస్ఫూర్తిగా రానా పొగిడిన తీరు అతడిపై గౌరవ భావం కలిగిస్తోంది.

‘బాహుబలి: ది కంక్లూజన్’‌లో ప్రభాస్‌కు సంబంధించిన ఒక ఇంటెన్స్ పోస్టర్ షేర్ చేస్తూ.. ”నా సహ నటుడు.. స్నేహితుడు.. నిజంగా బాహుబలి అయిన ఈ జెంటిల్‌మన్‌కు బిగ్ సెల్యూట్. అతను ఐదేళ్ల పాటు ‘బాహుబలి’ కోసం దృఢంగా నిలబడ్డాడు. అది కూడా తన కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగా ఇలా చేశాడు. దేని మీదా ప్రశ్నించలేదు. సందేహించలేదు.

ఎప్పుడూ నవ్వుతూ ఉన్నాడు. ఇప్పుడతను అతి పెద్ద పాన్ ఇండియా సూపర్ స్టార్‌గా నిలబడ్డాడు. ఈ గుర్తింపుకు అతను పూర్తిగా అర్హుడు. ఈ ప్రయాణంలో నేను కూడా భాగస్వామినైనందుకు గర్వంగా ఉంది. సాహోరే బాహుబలి” అన్నాడు రానా. అతడి ప్రతి మాటలోనూ ఒక సిన్సియారిటీ కనిపిస్తోంది. ఇలా తన సహనటుడి గురించి నిజాయితీగా.. గొప్పగా చెప్పిన రానా అభినందనీయుడే.


Recent Random Post: