
సంజయ్‌దత్ జీవిత కథతో రాజ్‌కుమార్ హిరాని సినిమా తీస్తోన్న సంగతి తెలిసిందే. మున్నాభాయ్, పీకే చిత్రాలతో తనకంటూ హై స్టాండర్డ్స్ సెట్ చేసుకున్న రాజ్‌కుమార్ అసలు సంజయ్‌దత్ జీవిత కథని ఎలా సినిమాగా మలుస్తాడనేది ఆసక్తి రేకెత్తిస్తోంది. రాజ్‌కుమార్ చిత్రాలంటే వినోదానికి పెట్టింది పేరు. తన శైలికి భిన్నమైన జీవనశైలి వున్న మున్నాభాయ్ కథని ఆయన ఎలా మలుస్తాడనేది ఆసక్తికరం.
ఇక ఆ పాత్రకి రణ్‌భీర్ కపూర్‌ని ఎంచుకోవడం మరింత ఆశ్చర్యపరిచింది. సంజయ్ దత్‌గా అతనేమి సరిపోతాడని అనుకున్నారు. అయితే రణ్‌భీర్ ట్రాన్స్‌ఫర్మేషన్ పిచ్చెక్కించేలా వుంది. అచ్చంగా సంజయ్‌దత్‌ని తలపించేలా కనిపిస్తోన్న రణ్‌భీర్ కపూర్ ఈ చిత్రంపై అంచనాలని ఒక్కసారిగా పెంచేసాడు.
సంజయ్ దత్ పోలికలకి దగ్గరగా అతడిని తీర్చి దిద్దిన విధానం అబ్బుర పరుస్తుంది. రణ్‌బీర్ గెటప్ వరకు సూపర్‌హిట్ అయినా కానీ సంజయ్ కథని కమర్షియల్ సినిమాగా ఎలా మలిచారనేదే ఇక తేలాల్సి వుంది. ఎలాంటి కథనైనా వినోదాత్మకంగా మలిచే నేర్పరి రాజ్‌కుమార్ హిరాని మరోసారి తన కనికట్టు చేసాడో లేదో చూడాలి.
Recent Random Post:

















