రేణు దేశాయ్‌ ఆపన్న హస్తం

పవన్ కళ్యాణ్‌ మాజీ భార్య రేణు దేశాయ్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. సోషల్‌ మీడియా ద్వారా అందరికి సోషల్‌ మెసేజ్ లు ఇస్తూ సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తిగా నిలిచారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఆమె తనవంతు సాయంను అందించేందుకు సిద్దం అయ్యారు. ఈ సమయంలో సెలబ్రెటీలు సమాచారంను షేర్‌ చేస్తూ ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నారు.

ఆక్సీజన్‌ లేక ఇబ్బంది పడుతున్న వారి వివరాలను షేర్‌ చేయడం ద్వారా ఆక్సీజన్ ఉన్న వారు వెంటనే స్పందిస్తున్నారు. అలా చాలా మంది సెలబ్రెటీలు కూడా తమ వంతు సహకారంను అందిస్తున్నారు. ఈసమయంలోనే రేణు దేశాయ్ కూడా ఆపదలో ఉన్న వారు సాయం కావాల్సిన వారు నాకు మెసేజ్ చేయండి అంటూ ప్రకటించింది. తనకు సాధ్యం అయినంత వరకు ఇచ్చేందుకు సిద్దం అంటూ పేర్కొంది.