ఆర్ ఆర్ ఆర్ టీమ్ కు భారీ పార్టీ ఇవ్వనున్న దిల్ రాజు

ఆర్ ఆర్ ఆర్ చిత్ర బాక్స్ ఆఫీస్ పెర్ఫార్మన్స్ పట్ల అగ్ర నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు చాలా సంతోషంగా ఉన్నాడు. ఈ చిత్రం నైజాంలో అంచనాలకు మించి వసూళ్లు సాధిస్తోంది. తెలుగు సినిమా చరిత్రలో తొలిసారి కేవలం నైజాం నుండే 100 కోట్లు వసూలు చేసిన మొదటి చిత్రంగా నిలిచింది. సెకండ్ వీకెండ్ అద్భుతమైన వసూళ్లు సొంతం చేసుకుంది.

ఈ నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ టీమ్ కు ఈరోజు దిల్ రాజు భారీ పార్టీ ఇవ్వనున్నాడు. వేదిక, సమయం తదితర వివరాలు సీక్రెట్ గా ఉంచారు. ఎస్ ఎస్ రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ తమ ప్రాజెక్ట్స్ తో బిజీ అవ్వకముందే పార్టీ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు దిల్ రాజు.

రాజమౌళి తన కుటుంబంతో కలిసి విదేశాలకు ట్రిప్ కు వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాడు. రామ్ చరణ్, శంకర్ తో తీస్తోన్న సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం బ్రేక్ లో ఉన్నాడు. జూన్ నుండి కొరటాల శివ సినిమా షూటింగ్ ఉంటుంది.