
పెళ్లి సెటిల్ అయిన తర్వాత ఒక్కటంటే ఒక్క భారీ సినిమా కూడా చేజిక్కించుకోలేకపోయిన సమంత పెళ్లి తర్వాత కూడా హీరోయిన్‌గానే కొనసాగాలని చూస్తోంది. ఇండస్ట్రీ కూడా తనని ఎంకరేజ్ చేస్తుందని భావించిన సమంతకి పెళ్లి జరగకముందే షాక్ తగిలింది. చైతన్యతో ప్రేమాయణం పబ్లిక్ అయిన దగ్గర్నుంచి సమంతకి ఆఫర్లు తగ్గిపోయాయి. దీంతో తనకి తెలిసిన వారందరినీ కాంటాక్ట్ చేస్తూ ఆఫర్ల కోసం ట్రై చేస్తోంది.
తాజాగా సుకుమార్ దర్శకత్వంలో చరణ్ హీరోగా రూపొందే చిత్రంలో ఇంకా హీరోయిన్ ఖరారు కాలేదని తెలిసేసరికి సమంత తనకి ఛాన్స్ ఉంటుందేమో అని ఆశ పడుతోంది. ఇంతవరకు చరణ్‌తో జంట కట్టలేదు కనుక తమ కాంబినేషన్ ఫ్రెష్‌గా ఉంటుందనేది ఆమె నమ్మకం.
ఈ చిత్రంలో నటించడానికి తాను రెడీ అని, పారితోషికం విషయంలో పట్టింపు లేదని సమంత వారికి ఫీలర్స్ పంపించినట్టు గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయితే అటువైపు నుంచి ఎలాంటి స్పందన రావడం లేదని, సమంతని హీరోయిన్‌గా తీసుకుంటే ప్రాజెక్ట్ ముందుకు కదలడం కష్టమని భావిస్తున్నారని టాక్. అఖిల్ పెళ్లి, తర్వాత తన పెళ్లి ఏర్పాట్లతో సమంత బిజీ అయితే ఆమె డేట్స్ దొరకవు.
వేగంగా పూర్తి చేయాలని చూస్తోన్న సినిమా ముందుకెళ్లదు. అందుకే సమంత విషయంలో ఆసక్తి చూపించడం లేదనేది తాజా సమాచారం. మరి ఈ ఆఫర్ చేజిక్కించుకోవడానికి సమంత ఏదైనా పెద్ద రికమండేషన్‌తో వెళుతుందేమో చూడాలి.
Recent Random Post: