రానా, తాప్పి… అంతేనా, ఇంకేం లేదా?

తెలుగులో దాదాపుగా కెరీర్ ఎండ్ అయిపోయిన భామ తాప్సీపై రూమ‌ర్లు మామూలుగా లేవు. ప్ర‌స్తుతం త‌మిళంలో బిజీగానే ఉన్న‌తాప్సి తెలుగు హీరో రానాతో ఎఫైర్ న‌డుపుతోంద‌ని పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ పుకార్ల‌తో తాప్సి తెగ ఇబ్బంది ప‌డుతోంద‌ట‌.

తెలుగు చిత్రాలతో కెరీర్‌ను ఆరంభించి, ఆ తర్వాత తమిళ చిత్రాలను కూడా చేసిన తాప్సికి ఇక్కడ అవకాశాలు సన్నగిల్లడంతో బాలీవుడ్‌పై దృష్టి కేంద్రీకరించిన విషయం తెలిసిందే. అక్కడ “చష్మేబద్దూర్‌, బేబి, పింక్‌’ వంటి చిత్రాల తర్వాత ఇప్పుడు ఘాజి, తడకా, నామ్‌ షబానా, జుడ్‌వా-2’ చిత్రాలతో బిజీగా ఉంది. ఏదోవిధంగా కెరీర్‌ మళ్లీ గాడిలో పడటంతో ఎనలేని ఆనందంతో ఉన్న తాప్సీకి ఇప్పుడు కొత్త సమస్య ఎదురైందని అంటున్నారు.

ఇప్పటికే బేబి, ఘాజిచిత్రాల్లో కలిసి నటించిన రానా, తాప్సీలు తాజాగా కాళి అనే ఇంకో చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో విడుదలకానుంది. ఇలా ఒకటికి మూడు చిత్రాలలో వీరు కలిసి నటించడం వదంతులకు కారణమైందన్నది టాక్‌. తాప్సీకి తన చిత్రంలో తీసుకోమని రానానే దర్శక, నిర్మాతలకు సూచిస్తున్నారంటూ వదంతులు వ్యాపించాయి. దాంతో అలాంటిదేమీ లేదని, సినిమాలోని పాత్రకు తాను సరిపోతానని భావించే దర్శక, నిర్మాతలు తనను ఎంపికచేస్తున్నారే తప్ప ఎవరూ తనను సిఫారసు చేయడం లేదని ఆమె అంటోంది. సినీ జ‌నాలు మాత్రం అంతేనా.. ఇంకేం లేదా అంటున్నారు.


Recent Random Post: