సాహో’ సర్ప్రైజ్ రెడీ అవుతోందా?

‘బాహుబలి’ లాంటి మెగా సినిమా తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా ‘సాహో’. ఈ సినిమాకు సంబంధించిన పని ఎప్పుడో మూడేళ్ల కిందట మొదలైంది. ‘రన్ రాజా రన్’తో ఆకట్టుకున్న యువ దర్శకుడు సుజీత్.. తన రెండో సినిమాను ప్రభాస్‌తోనే చేయాలని పట్టుబట్టి మరీ రెండేళ్లకు పైగా ఖాళీగా ఉండిపోయాడు.

ఎట్టకేలకు ఈ ఏడాది ప్రభాస్ ఖాళీ అయ్యాడు. వీళ్లిద్దరి కాంబినేషన్లో ‘సాహో’ సెట్స్ మీదికి వెళ్లింది. ‘సాహో’ సెట్స్ మీదికి వెళ్లడానికంటే ముందే ఈ చిత్ర ప్రి లుక్ పోస్టర్.. ఫస్ట్ టీజర్ లాంచ్ చేసిన అభిమానుల్ని మురిపించాడు సుజీత్. ఐతే ఫ్యాన్స్ అంతటితో ఆగట్లేదు. సినిమాలో ప్రభాస్ పూర్తి స్థాయి లుక్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

ఉత్సాహం ఆపుకోలేని అభిమానులు ఫ్యాన్ మేడ్ పోస్టర్లతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. వాటిని సుజీత్ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేస్తూ.. ఒరిజినల్ లుక్ కోసం డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఒక అభిమాని సాహో లోగో పోస్టర్‌కు పాలాభిషేకం చేస్తున్న వీడియో ఒకటి పెట్టి.. అభిమానులు ఇలా ఏదేదో చేస్తున్నారు.. వాళ్లను మురిపించేలా ఏదో ఒక విశేషం పంచుకోవచ్చు కదా అని అడిగాడు.

దీనికి సుజీత్ బదులిస్తూ.. అంతా రెడీగా ఉందని.. ఆగస్టు 15 లోపు కానిచ్చేద్దామని అన్నాడు. దీన్ని బట్టి ప్రభాస్ ఫ్యాన్స్ కోసం త్వరలోనే సర్ప్రైజ్ ట్రీట్ ఒకటి ఉంటుందన్నమాట. బహుశా ప్రభాస్ స్పెషల్ లుక్ ఏదైనా స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా రిలీజ్ చేస్తారేమో చూడాలి.


Recent Random Post: