సాయిధరమ్ తేజ్ ను కాపాడిని యువకుడికి మెగా గిఫ్ట్..! ఫుల్ క్లారిటీ ఇదే..

మెగా హీరో సాయిధరమ్ తేజ్‌ ఇటివల బైక్ ప్రమాదానికి గురై ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ప్రమాదానికి గురైన సందర్భంలో సాయితేజ్ ను కాపాడిన యువకుడు మహ్మద్ ఫర్హాన్‌పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. దీంతోపాటు ఫర్హాన్‌కు మెగా ఫ్యామిలీ భారీ గిఫ్ట్ ప్రకటించిందని.. రామ్ చరణ్ ఖరీదైన కారు ఇచ్చినట్లు వార్తలు వెల్లువెత్తాయి. దీనిపై ఫర్హాన్ స్పందించాడు.

తనకెవరూ గిఫ్ట్ ఇవ్వలేదని.. కారు బహుమతిగా ఇచ్చారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని చెప్పాడు. ఆపదలో ఉన్న వ్యక్తి ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నించానే కానీ.. ఏదో ఆశించి చేయలేదని చెప్పుకొచ్చాడు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలతో తన కుటుంబం ఇబ్బందులు పడుతోందని అన్నాడు. దీనిపై రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పాడు. ఈ తరహా వార్తలు ప్రసారం చేసి తనను, తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టొద్దని ఫర్హాన్ కోరాడు.