
సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ చిత్రాలు బాగా ఆడేసరికి సాయిధరమ్ తేజ్ మార్కెట్ ఒకేసారి బాగా ఊపందుకుంది. అయితే తిక్క, విన్నర్ చిత్రాల పరాజయాలు అతడిని ఆలోచనలో పడేసాయి. కమర్షియల్ కథలు చేస్తూ సేఫ్ గేమ్ ఆడాలని చూసిన సాయిధరమ్ తేజ్‌కి ఇది ఎంత మాత్రం సేఫ్ కాదని తెలిసి వచ్చింది. ప్రయోగం చేసి విఫలమైనా జనం ఏమనుకోవడం లేదు కానీ, రొటీన్ సినిమాతో ఫ్లాప్ అయితే మాత్రం ఆ హీరోని పట్టించుకోవడం మానేస్తున్నారు.
విన్నర్ చిత్రానికి ఓపెనింగ్స్ వచ్చాయని గంభీరంగా కనిపించినా, సోమవారం నుంచి అసలు ‘సినిమా’ ఏంటనేది కనిపిస్తూ వుండడంతో సాయిధరమ్ తేజ్ రియలైజ్ అయ్యాడు. మరికొన్ని కమర్షియల్ సినిమాలు చేసి దెబ్బ తినడం కంటే ముందునుంచీ జాగ్రత్త పడి కొత్తరకం కథల్ని ఎంకరేజ్ చేయడం బెస్ట్ అని డిసైడ్ అయ్యాడు. మరో నాలుగైదు సినిమాల వరకు కమర్షియల్ కథల జోలికి పోకుండా పూర్తిగా వైవిధ్యానికే కట్టుబడి వుండాలని అనుకుంటున్నాడు.
నిజానికి అతను ‘శతమానం భవతి’ చేయాల్సింది. కానీ దిల్ రాజు రాజకీయంతో అది తేజ్ మిస్ అయిపోయాడు. ఒకవేళ విన్నర్ ప్లేస్‌లో అది వచ్చినట్టయితే ఇప్పుడు తేజ్ రేంజ్ మరోలా వుండేది. అయినప్పటికీ డిసప్పాయింట్ అవకుండా, తదుపరి చిత్రాల మీద దృష్టి పెడుతున్నాడు.
Recent Random Post: