బన్నీ మీద తేజు వేసేశాడుగా..

చిన్న వివాదం అనుకున్నది కాస్తా నెమ్మదిగా పెద్దదైపోతోంది. పవన్ కళ్యాణ్ అభిమానులకు.. అల్లు అర్జున్‌కు మధ్య అగాథం రోజు రోజుకూ పెరిగిపోతోంది. ‘దువ్వాడ జగన్నాథం’ టీజర్‌కు అదే పనిగా డిజ్ లైక్స్ కొట్టడం ద్వారా అల్లు అర్జున్ మీద తమకున్న ఆగ్రహాన్ని చూపిస్తున్నారు పవన్ ఫ్యాన్స్. ఐతే అభిమానులేదో ఆవేశంలో చేస్తే పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు అనుకోవచ్చు. వాళ్లను కంట్రోల్ చేయడం కూడా కష్టమే కాబట్టి దాని గురించి బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన పని లేదు. ఐతే స్వయంగా ఒక మెగా హీరోనే అల్లు అర్జున్ మీద తన సినిమాలో సెటైర్లు వేయడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.

శుక్రవారం రిలీజైన ‘విన్నర్’ సినిమాలో రెండు చోట్ల పరోక్షంగా అల్లు అర్జున్ మీద సెటైర్లు పడటం విశేషం. ఈ సినిమా గుర్రపు పందేల నేపథ్యంలో సాగుతుందన్న సంగతి తెలిసిందే. ఒక చోట గుర్రాన్ని చూపెట్టి భయపెడితే.. ‘‘అది రేసుగుర్రం అయితే మా వాడు దాన్ని స్వారీ చేస్తాడు’’ అనే డైలాగ్ వినిపిస్తుంది. ‘రేసుగుర్రం’ అన్నది బన్నీ టైటిల్ అన్న సంగతి తెలిసిందే. ఇది ఉద్దేశపూర్వకంగా వేసిన సెటైరే అని బన్నీ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక ఇదే సినిమాలో మరో చోట తనకు తెలుగు భాషలో నచ్చని సినిమాలు రెండే రెండు అంటూ.. ‘రేసుగుర్రం’, ‘నాన్నకు ప్రేమతో’ పేర్లు చెబుతాడు.

సినిమాలో సందర్భానుసారం ఆ డైలాగ్ ఓకే అనిపిస్తుంది కానీ.. ఇక్కడ కూడా బన్నీకి తగిలేలా ఉద్దేశపూర్వకంగానే సైటైర్ వేశారన్న డిస్కషన్ నడుస్తోంది. మెగా ఫ్యామిలీ హీరోల సినిమాల వేడుకల్లో పవన్ ఫ్యాన్స్ గోల చేయడంపై బన్నీ వారికి వార్నింగ్ ఇస్తే.. సాయిధరమ్ మాత్రం వాళ్లకు మద్దతుగా మరో వేడుకలో మాట్లాడటం తెలిసిందే. అప్పట్నుంచి బన్నీ-సాయిధరమ్ మధ్య కూడా దూరం పెరిగిందని భావిస్తున్నారు.


Recent Random Post: