
ఇంతకుముందులాగా చేస్తే సినిమానే చేయాలని వర్ధమాన దర్శకులు పంతం పట్టుకుని కూర్చోవట్లేదు. మెగా ఫోన్ పట్టే ముందే తమ టాలెంట్ ఏంటో వేరే మార్గాల్లో రుజువు చేసుకుంటున్నారు. షార్ట్స్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌తో అదరగొడుతున్నారు. కొన్ని షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ చూస్తే.. సినిమాలకు ఏమాత్రం తక్కువగా అనిపించట్లేదు. పరిమిత బడ్జెట్లోనే సినిమాలకు మించి క్వాలిటీ చూపిస్తూ అదరగొడుతున్నారు యువ దర్శకులు.
నటీనటులు కూడా ఇక్కడ తమ టాలెంట్ చూపిస్తున్నారు. తెలుగులో ‘అద్వైతం’ లాంటి షార్ట్ ఫిల్మ్స్.. ‘ముద్దపప్పు ఆవకాయ’ లాంటి వెబ్ సిరీస్ మంచి ఆదరణ పొందాయి. తాజాగా ఒక వెబ్ సిరీస్ ట్రైలర్ చూస్తే సినిమా స్థాయికి దీటుగా ఉండేలా కనిపిస్తోంది.
ఈ వెబ్ సిరీస్ పేరు.. ‘నేను మీ కళ్యాణ్’. ‘కేరింత’, ‘మనమంతా’ సినిమాల్లో నటించిన విశ్వాంత్ ఇందులో హీరో. షాలిని అనే అమ్మాయి కథానాయికగా నటించింది. ఒక కుర్రాడి స్వీట్ లవ్ స్టోరీని ఇందులో చూపిస్తున్నారు. రెండు నిమిషాలకు పైగా నిడివి ఉన్న ట్రైలర్ చూస్తే ఈ వెబ్ సిరీస్‌పై మంచి అంచనాలు కలగడం ఖాయం. చాలా ఫన్నీగా సాగేలా ఉందిది.
విశేషం ఏంటంటే.. ఈ వెబ్ సిరీస్‌లో యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ కూడా ఓ అతిథి పాత్ర చేశాడు. హీరో తన కథేంటన్నది వివరించే తేజుకే. ట్రైలర్ ఆరంభంలోనే తేజు వాయిస్ వినిపిస్తుంది. ముగింపులో తేజునే కనిపిస్తాడు. ఇలా ఒక పేరున్న నటుడు వెబ్ సిరీస్‌లో అతిథి పాత్ర చేయడం విశేషమే. కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్ త్వరలోనే యూట్యూబ్‌లో రిలీజవుతుంది.
Recent Random Post: