ఘనంగా సాయి కుమార్ షష్టిపూర్తి

సినీ నటుడు, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌, బుల్లి తెర హోస్ట్ సాయి కుమార్‌ షష్టిపూర్తి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిరంజీవి మరియు వెంకటేష్‌ తో పాటు ఎంతో మంది ప్రముఖులు పాల్గొన్నారు. షష్టి పూర్తి కార్యక్రమంను కుటుంబ సభ్యులు వైభవంగా నిర్వహించారు. మళ్లీ పెళ్లి అన్నట్లుగా సాయి కుమార్‌ దంపతులను అలంకరించి మంగళ స్థానాలు చేయించి వైభవంగా పెళ్లి కార్యక్రమంను జరిపించారు.

సాయికుమార్ కొడుకు కొడలు నుండి మొదలుకుని తమ్ముళ్లు ఇతర కుటుంబ సభ్యులు అంతా కూడా ఈ వేడుకలో పాల్గొనడంతో కలర్‌ ఫుల్ గా మారింది. జీవితంలో ముఖ్యమైన ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరు అయ్యి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అయిదు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సాయి కుమార్‌ ఇప్పటికి కూడా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. సాయి కుమార్‌ తనయుడు ఆది సాయి కుమార్ టాలీవుడ్‌ లో ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే.