సాయి పల్లవి రేంజ్ అంటే అట్లుంటది మరి!

మోస్ట్ టాలెంటెడ్ సౌత్ ఇండియన్ నటీమణుల్లో సాయి పల్లవి టాప్ లిస్టులో ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో తన పాత్ర మాత్రం చాలా విభిన్నంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది. భాషతో సంబంధం లేకుండా సౌత్ ఇండస్ట్రీ లో మంచి హీరోయిన్ గా క్రేజ్ అందుకుంటున్న సాయి పల్లవి ఏదైనా సినిమాలో నటించింది అంటే ఆ చిత్ర యూనిట్ సభ్యులు అందరూ కూడా ఆమె ద్వారానే సినిమా జనాల్లోకి కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు.

అయితే విరాటపర్వం విషయానికి వచ్చేసరికి అంతకుమించి అనేలా చిత్ర యూనిట్ సభ్యులు అందరూ కూడా సాయి పల్లవి జపం చేస్తున్నారు అని చెప్పాలి. ముఖ్యంగా నేషనల్ లెవల్లో బాహుబలితో గుర్తింపును అందుకున్న రానా దగ్గుబాటి సైతం విరాటపర్వం సాయిపల్లవి సినిమా అంటూ ఆమెను ఎక్కువగా ప్రమోట్ చేస్తూ ఉండడం విశేషం. అంతేకాకుండా ఈ సినిమాకు ఆమె హీరో అని కూడా చెబుతున్నాడు.

ఒక విధంగా సాయి పల్లవి ఏ సినిమాలోనైనా నటిస్తే ఆమె పాత్ర చాలా హైలెట్గా ఉంటుంది. ఇక అప్పట్లో వరుణ్ తేజ్ ఫిదా సినిమా చేసినప్పుడు ఆమెనే హైలెట్ అయ్యింది.

ఆ తర్వాత నాగచైతన్యతో లవ్ స్టోరీ సినిమా చేసిన సాయి పల్లవి మాత్రమే ఎక్కువగా హైలెట్ అయింది. వీలయినంతవరకు సాయి పల్లవి హీరోలను డామినేట్ చేసే విధంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆ తరహాలోనే ఆమెను ఉపయోగించుకుంటే కూడా లాభం ఉంటుంది.

ఒక విధంగా ఆమెతో పనిచేసిన హీరోలు అందరూ కూడా ఎలాంటి ఈర్ష లేకుండా అదే తరహాలో ముందుకు సాగుతుండడం మెచ్చుకో దగిన విషయం. ఇక రానా దగ్గుబాటి అయితే విరాటపర్వం సినిమాలో సాయి పల్లవి క్యారెక్టర్ అద్భుతంగా ఉంటుంది అని ఈ సినిమాలో సాయి పల్లవి తప్పితే ఆమె చేసిన పాత్రకు ఇంకొకరు న్యాయం చేయలేరు అని కూడా అన్నాడు.

ఇటీవల కాలంలో ది బెస్ట్ యాక్టర్స్ లో ఆమె టాప్ లిస్టులో ఉంటుంది అని కూడా ప్రశంసలు కురిపించాడు. ఏదేమైనా కూడా సాయి పల్లవి విరాట పర్వం సినిమాలో హీరో అని రానా దగ్గుబాటి హైలెట్ చేస్తూ ఉండడం విశేషం. ఇక సాయి పల్లవి క్రేజ్ అంటే అట్లుంటది మరి అని అభిమానులు చెప్పుకుంటున్నారు.