సూపర్ స్టార్ డైరెక్షన్ ప్లాన్స్

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ప్రతి సినిమా వంద కోట్లు అంతకు మించి వసూళ్లు దక్కించుకుంటుంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఆయన సినిమాల కోసం అభిమానులు ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటారు. నటుడిగా సుదీర్ఘ అనుభవం ఉన్న సల్మాన్ ఖాన్ త్వరలోనే దర్శకత్వం వహించే ఆలోచనల్లో ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు. చాలా మంది హీరోలు మరియు నటీ నటులు దర్శకత్వం చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెల్సిందే. అందుకే సల్మాన్ ఖాన్ దర్శకత్వం చేస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న సినిమాలు భారీ బజ్ ను కలిగి ఉంటాయి. ఒక వేళ ఆయన దర్శకత్వంలో సినిమా చేసినా ఏమాత్రం బజ్ తగ్గకుండా అదే రేంజ్ లో అభిమానుల మెప్పు ను దక్కించుకుంటాయనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల మీడియాతో మాట్లాడిన సల్మాన్ ఖాన్ డైరెక్టర్ గా సినిమాలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు. చాలా సంవత్సరాలుగా సినిమాల కథలు రాస్తున్నాను. ఎన్నో స్టోరీ లైన్స్ ఉన్నాయి. వాటిలో నుండి కొన్నింటిని తీసి సినిమాను తీస్తానంటూ ఆయన చెప్పుకొచ్చాడు. అయితే దర్శకుడిగా మారేందుకు ఇంకా ఎంత కాలం తీసుకునేది మాత్రం చెప్పలేదు. హీరోగా సినిమాల్లో నటించడం మానేసిన తర్వాత లేదంటే హీరోగా చేస్తూనే సల్లూ భాయ్ డైరెక్షన్ చేస్తాడేమో చూడాలి. హీరోగా స్టార్ గా దూసుకు పోతున్న సమయంలో దర్శకత్వం చేయడం అంటే కాస్త సాహస నిర్ణయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ దర్శకత్వం ప్లానింగ్స్ విషయమై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

దర్శకత్వం చేయడం పక్కా కాని.. ఎప్పుడు.. ఎవరితో అనే విషయంలో మాత్రం కాస్త క్లారిటీ రావాల్సి ఉంది. బాలీవుడ్ తో పాటు దేశ వ్యాప్తంగా అభిమానులను దక్కించుకున్న సల్మాన్ ఖాన్ ఒక వేళ దర్శకత్వం చేస్తే ఆయన మొదటి సినిమా ఖచ్చితంగా దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ ను దక్కించుకునే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ టైగర్ 3 సినిమాను చేస్తున్నాడు. ఇటీవలే తన బావ నటించిన అంతిమ్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. టైగర్ 3 సినిమాపై కూడా అంచనాలు ఆకాశమే హద్దు అన్నట్లుగా అంచనాలు ఉన్నాయి. ఒక వైపు హీరోగా నటిస్తూ మరో వైపు బిగ్ బాస్ కు హోస్ట్ గా చేస్తూ నిర్మాతగా ఇంకా పలు రంగాల్లో ఉన్న సల్మాన్ త్వరలోనే దర్శకుడిగా మారబోతున్న నేపథ్యంలో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.