సల్మాన్ ఖాన్ బాడీగార్డ్‌ జీతం ఎంతో తెలుసా!

సినిమా సెలబ్రిటీలు.. ముఖ్యంగా స్టార్స్ పారితోషకం ఈ మధ్య కాలం లో భారీగా పెరిగింది. స్టార్ హీరోల రెమ్యూనరేషన్ లు చుక్కలు తాకుతున్న నేపథ్యం లో వారి యొక్క పర్సనల్ స్టాఫ్‌ యొక్క రెమ్యూనరేషన్ కూడా భారీగా పెరిగాయి. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్స్ యొక్క సెక్యూరిటీ సిబ్బందికి అత్యధికంగా ఖర్చు చేస్తారని టాక్ ఉంది. ఆ మధ్య ఒక స్టార్ హీరోయిన్ తన సెక్యూరిటీ స్టాఫ్ కి నెలకు పది లక్షల వరకు ఖర్చు చేస్తుందని వార్తలు వచ్చాయి.

తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన బాడీ గార్డ్ షేరా కి ఏకంగా సంవత్సరానికి రెండు కోట్ల రూపాయల వేతనం ఇస్తున్నాడని తేలింది. గతంలో మిస్టర్ ముంబై టైటిల్ని దక్కించుకున్న షేరా బాడీ బిల్డర్. సల్మాన్ ఖాన్‌ తో 28 సంవత్సరాలుగా షేరా అనుబంధం కొనసాగుతోంది. సల్మాన్ ఖాన్ వద్ద జీతానికి పని చేస్తున్నా అన్నట్టుగా కాకుండా ఒక స్నేహితుడిగా, కుటుంబ సభ్యుడిగా షేరా వ్యవహరిస్తాడు. షేరా గతంలో మైకేల్ జాక్సన్, విల్ స్మిత్, జాకీ చాన్‌ ప్రముఖులకు సేవలందించాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తనకు నెలకు 15 లక్షలు జీతం అని తెలియ జేశాడు. ఏడాదికి రెండు కోట్ల జీతం అందుకుంటున్న అత్యంత ఖరీదైన సెక్యూరిటీ గార్డుగా షేరా రికార్డు నెలకొల్పాడు.