లింగరీ ప్రచారానికి ‘ఊ’ అంటావా సామ్?

ఓవైపు తెలుగు సినిమాలు.. మరోవైపు వెబ్ సిరీస్ లు.. ఇంకో వైపు బీటౌన్ ప్రయత్నాలు .. ఇలా సాగుతోంది అందాల సమంత జీవనం. అటు హాలీవుడ్ లో రంగ ప్రవేశానికి కూడా ప్రయత్నం సాగుతోంది. వీటన్నిటితో పాటు వాణిజ్య ప్రకటనల ప్రచారంతోనూ సామ్ బాగానే ఆర్జిస్తోంది. రకరకాల వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టిన సమంత వాటికి బ్రాండింగ్ కూడా చేస్తోంది. సమకాలీన కథానాయికల్లో సామ్ దూరదృష్టి నిరంతరం హాట్ టాపిక్.

ఇకపోతే ఇటీవలి కాలంలో సమంత హద్దులు చెరిపేస్తూ అందాల ఆరబోతకు వెనకాడకపోవడం అభిమానుల్లో చర్చకు వచ్చింది. సామ్ వరుస ఫోటోషూట్లు అంతర్జాలంలో అగ్గి రాజేస్తున్నాయి. ముఖ్యంగా పుష్ప చిత్రంలో ఊ అంటావా ఊఊ అంటావా? పాట బ్లాక్ బస్టర్ అయ్యాక.. ఆ ప్రభావం ఇంకా తనని వదిలి పెట్టినట్టు లేదు.

ఐటమ్ నంబర్ లో ఒక రేంజులో ఆరబోసిన సామ్.. ఆ తర్వాతా దానిని కంటిన్యూ చేస్తూనే ఉంది. ముఖ్యంగా సోషల్ మీడియాల్లో ప్రమోషన్స్ కోసం సామ్ మరింతగా హద్దులు చెరిపేస్తోంది. తాజాగా ఓ ప్రఖ్యాత ఇన్నర్ (లోదుస్తుల) బ్రాండ్ కి ప్రచారం కోసం షేర్ చేసిన ఓ ఫోటోగ్రాఫ్ వెబ్ లో మంటలు పుట్టిస్తోంది.

ఇంతకుముందు సీకే బ్రాండ్ కి దిశా పటానీ… ప్రగ్య జైశ్వాల్ లాంటి భామలు ఒక రేంజులో ఆరబోతతో ప్రమోషన్ చేసారు. ఇప్పుడు అందుకు ధీటుగానే సమంత ఈ లోదుస్తుల బ్రాండ్ కి ప్రచారం చేస్తోందని అర్థమవుతోంది. ప్రఖ్యాత బ్రాండ్ లోదుస్తులను ధరించి సామ్ ఇచ్చిన ఫోజు గుండె గిల్లుతోంది. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్ ని యువతరం వైరల్ గా షేర్ చేస్తున్నారు. సమంతా గ్లామర్ విందు విస్పోటనంలా మారింది.

కెరీర్ మ్యాటర్ కి వస్తే.. సమంత గత చిత్రం ‘కాతు వాకులా రెండు కాదల్’ సంతృప్తికర ఫలితాన్ని అందించింది. చివరిగా నయనతార- విజయ్ సేతుపతి- సమంత ప్రధాన పాత్రల్లో విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రేక్షకులు విమర్శకుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. మరోవైపు సామ్ నటిస్తున్న ‘యశోద’ చివరి షెడ్యూల్ షూటింగ్ లో ఉంది. ఈ చిత్రం ఆగస్టు 12న విడుదల కానుంది. అలాగే తన ‘శాకుంతలం’ విడుదల కోసం ఎదురుచూస్తోంది.

విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్న ‘ఖుషీ’ షెడ్యూళ్లు కొనసాగుతున్నాయి. రెండవ షెడ్యూల్ జూన్ 8 నుండి కొనసాగుతోంది. అలాగే అవెంజర్స్ మేకర్స్ రస్సో బ్రదర్స్ నిర్మిస్తున్న ‘సిటాడెల్’లోనూ సామ్ నటిస్తోంది. వరుణ్ ధావన్- సమంత ప్రధాన పాత్రల్లో రాజ్ నిడిమోరు -కృష్ణ డికె దర్శకత్వంలో ఈ సిరీస్ తెరకెక్కనుంది. జూలై నుంచి ఈ సిరీస్ సెట్స్ పైకి వెళుతుందని సమాచారం. ఫ్యామిలీమ్యాన్ 2 తర్వాత సామ్ కి రాజ్ అండ్ డీకేతో అద్భుత అవకాశమిది. బాఫ్టా-విజేత దర్శకుడు ఫిలిప్ జాన్ తెరకెక్కించనున్న చిత్రం ‘అరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్’తో సమంత హాలీవుడ్ లోకి అడుగుపెట్టనుంది.